బ్యాంక్‌ లోన్‌ కట్టలేని స్థితిలో ఆ ఛాన్స్‌ దక్కింది

Update: 2018-11-30 06:27 GMT
హీరోయిన్‌ గా సౌత్‌ లో పరిచయం అయ్యి ఆ తర్వాత బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ ఫ్లాట్‌ ఫారమ్స్‌ పై కూడా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. బోల్డ్‌ సినిమాలైనా, పద్దతైన పాత్రలైనా ఇట్టే ఒదిగి పోయి, పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేసే రాధిక ఆప్టే ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్థాయిలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ లలో కీలక పాత్రు పోషిస్తోంది. దాంతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా - మోడల్‌ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవడంతో పాటు, ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి రాధిక ఆప్టే ఒకప్పుడు స్టడీ కోసం తీసుకున్న బ్యాంకు లోను కట్టలేని పరిస్థితులను ఎదుర్కొందట.

లండన్‌ లో చదువుకునేందుకు తీసుకున్న బ్యాంక్‌ లోన్‌ కట్టడం ఇబ్బంది అయ్యింది, ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తిన సమయంలో నాకు సౌత్‌ ఇండియా నుండి సినీ ఆఫర్లు వచ్చాయి. ‘రక్త చరిత్ర’ సినిమాలో నటించడంతో నాకు ఆర్థిక వెసులుబాటు దక్కింది. సౌత్‌ సినిమాల్లో నటించిన సమయంలో వచ్చిన పారితోషికంతో బ్యాంకు లోను తీర్చేయడం జరిగిందని - అందుకే తనకు సౌత్‌ సినిమాలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకొచ్చింది.

సౌత్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పిన రాధిక ఆప్టే గతంలో తాను సౌత్‌ సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని - తెలుగు - తమిళ పరిశ్రమలో కీచకులు ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ లో కంటే సౌత్‌ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ చాలా ఎక్కువ అంటూ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అన్ని విధాలుగా ఆదుకున్న సౌత్‌ పై మరి అలాంటి అబాండాలు ఎందుకో మరి అంటూ రాధికను కొందరు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News