ఫోబియా.. రజినీ బ్యూటీ భయపెట్టేస్తోంది

Update: 2016-04-25 16:49 GMT
రాధికా ఆప్టే.. డిఫెరెంట్ చిత్రాలకు, పెర్ఫామెన్స్-ట్యాలెంట్ వంటి వాటికి కేరాఫ్ అడ్రస్ అయిపోతోంది. అహల్య అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన షార్ట్ ఫిలింలో నటించి ఆకట్టుకున్న రాధికా ఆప్టే.. రజనీకాంత్ సరసన రోబో సీక్వెల్ 2.0లో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఫోబియా అనే మూవీ.. మే నెల 27న విడుదలకు సిద్దమైంది.

కేరక్టర్ ప్రకారం రాధిక పోషించిన పాత్రకు అగోరా ఫోబియా ఉంటుంది. అంటే.. బయటకు రావాలంటే విపరీతంగా భయపడ్డం. బయటకు కాలుపెడితే.. అదే తనకు ఆఖరి రాత్రి అనే నమ్ముతుంది మెహక్(రాధికా ఆప్టే పాత్ర పేరు). అయితే.. ఆమెకు ఇంటిలో కూడా భద్రంగా ఉండలేదు. ఇంటిలోపల కూడా అనేక భయానక దృశ్యాలు, సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అటు ఇంట్లో ఉండలేక, ఇటు బయటకు వెళ్లలేక.. నరకం అనుభవిస్తుంది మెహక్.

మరోవైపు ఆమెను అనుభవించాలని చూసేవాళ్లు, భయపెట్టేవాళ్లు, ఆమె ఫోబియాను అడ్డం పెట్టుకుని అనుభవించాలని చూసేవాళ్లు.. వీళ్లందరి మధ్య ఓ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో.. భయంకంరంగా తీశాడు డైరెక్టర్ పవన్ కిర్పలాని. వన్ మినిట్ ట్రైలర్ లోనే ఒళ్లు జలదరించే సన్నివేశాలు చాలా కనిపించాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో అనే ఆలోచన తప్పకుండా కలుగుతుంది. మరి ఆ సంగతి తెలియాలంటే వచ్చే నెల 27వరకూ ఆగాల్సిందే.

క్లిక్ చేయండి ట్రైలర్ చూడటానికి
Tags:    

Similar News