ఆట నడుస్తూనే ఉండాలి -డీఎస్పీకి అంకితం

Update: 2015-12-17 16:24 GMT
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడులో.. జాగో జాగోరే జాగో అంటూ సాగే పాట ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఈ సాంగ్ ను పాడిన వ్యక్తి రఘు దీక్షిత్. ఎంతో అర్ధవంతమైన ఆ పాటతో స్ఫూర్తి నింపిన ఆయన.. ఇప్పుడు 'ది షో మస్ట్ గో ఆన్'.. ఆట నడుస్తూనే ఉండాలంటూ.. సింగర్ కం కంపోజర్ అయిన రఘు దీక్షిత్ ఓ పోస్ట్ చేశారు.

ఈయన మొదటి ప్రదర్శన "ఎక్లిప్స్" ఇవ్వాల్సిన రోజున.. ఉదయాన్నే తండ్రి మరణించారట. అదే రోజు మధ్యాహ్నం తండ్రికి అంత్యక్రియలు జరిపించి, ఇంటికెళ్లి రెడీ అయి, సాయంత్రం షో కి హాజరయ్యారట రఘు. ఇందుకు ప్రోత్సాహం ఇచ్చింది తన తల్లే అని, ఆట ఆగకూడదు, నడుస్తూనే ఉండాలని అన్నారని అమ్మ చెప్పారంటున్నారు రఘు. ఎన్నో బాధలు ఉన్నా కళాకారులు తమ బాధ్యతను, తమ కళను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ వేయరాదని అన్నారు. ఎముకలు విరిగిపోయేంత నొప్పులు ఉన్నా డ్యాన్స్ చేసిన డ్యాన్సర్లని, గొంతుతో పాటు హృదయం కూడా ముక్కలయేంత బాధలున్న సింగర్లను తాను చూశానని.. అయినా సరే తమ కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని గమనించాన్నారు రుఘు దీక్షిత్.

ఇలా రాసిన నోట్ ను రీసెంట్ గా పితృ వియోగంతో బాధపడుతున్న దేవిశ్రీ ప్రసాద్ కి అంకితం ఇచ్చినట్లు చెప్పారాయన. ఇప్పుడు నాన్నకు ప్రేమతో మూవీకి ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేర్చడానికి దేవిశ్రీ అలాగే పని చేయాలని సూచించారు. తండ్రి మీద ఎంతో ప్రేమ ఉన్న దేవిశ్రీ.. ఇప్పుడు నాన్నకు ప్రేమతో అనే చిత్రానికి.. ఈ పరిస్థితిలో సంగీతం ఇవ్వాల్సిరావడం యాదృచ్ఛికమే అని రఘు అంటున్నారు
Tags:    

Similar News