బాహుబలిని కాపీ కొట్టేస్తున్న రాజ్ తరుణ్

Update: 2017-05-29 11:01 GMT
బాహుబలిని ఏ విషయంలోనూ కాపీ కొట్టేయడం అంత తేలికేమీ కాదు. కామెడీ కోసం ఒకటి అరా స్పూఫ్ లు తీయచ్చేమో కానీ.. బాహుబలిని ఇమిటేట్  చేయడం చాలా క్లిష్టమైన విషయం. అందుకే సినిమాను కాకుండా.. బాహుబలి2 చూపించిన రూట్ ను ఫాలో అయిపోతున్నాడు రాజ్ తరుణ్.

అంధగాడు అంటూ రాజ్ తరుణ్ ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చేనెల 2వ తేదీని రిలీజ్ చేసేయనున్నారు. ఇప్పుడీ సినిమా కోసం ముందు రోజునే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అంటే జూన్ 1 సాయంత్రం నుంచే అంధగాడు ప్రీమియర్స్ ను ఎంపిక చేసిన పట్టణాల్లో ప్రదర్శించనున్నారు. హైద్రాబాద్ తో పాటు విజయవాడ.. విశాఖపట్నం.. గుంటూరు.. ఏలూరు.. రాజమండ్రి.. తిరుపతిలలో ఈ ప్రీమియర్స్ టెలికాస్ట్ చేయనున్నారు. నిజానికి ఇలా పబ్లిక్ కి ప్రీమియర్స్ ప్రదర్శించే కల్చర్ బాహుబలి2తో మొదలైంది.

అమెరికా ప్రీమియర్స్ కంటే ముందే.. ఇక్కడ మొదటి షో పడిపోవడాన్ని బాహుబలి2తో స్టార్ట్ చేయగా.. ఇప్పుడు అదే రూట్ ను రాజ్ తరుణ్ ఎంచుకున్నాడు. మరి ఈ కొత్త ఐడియాతో.. అంతటి విజయం కాకపోయినా.. హిట్ కొట్టేస్తే చాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News