కుక్కల్ని కిడ్నాప్ చేస్తున్న కుర్ర హీరో

Update: 2016-06-28 11:12 GMT
కుర్ర హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు. ఓ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాక ఫ్లాప్ వచ్చినా.. మళ్లీ హ్యాట్రిక్ హిట్స్ కి ఇప్పటికే శ్రీకారం చుట్టేశాడు ఈ కుర్రాడు. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకోవడంలో రాజ్ తరుణ్ తర్వాతే ఎవరైనా. ప్రతీ సినిమాలోనూ విభిన్నంగా తన కేరక్టర్స్ ఉండాలనుకునే రాజ్ తరుణ్.. ఇప్పుడు సెలక్షన్ లో ఓ సాహసం చేసేస్తున్నాడు.

కిడ్నాపులు చేసే హీరో పాత్రను ఇప్పటివరకూ చాలాసార్లు చూశాం. కానీ కుక్కల్ని కిడ్నాప్ చేయడమే వృత్తిగా పెట్టుకునే హీరో కేరక్టరైజేషన్ అంటే కచ్చితంగా డిఫరెంట్ పాయింటే. దీన్ని చేసేందుకు ఓ హీరో యాక్సెప్ట్ చేయడమంటే అది సాహసమే. ఆ సాహసానికే ఇప్పుడు రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఓ చిత్రంలో రాజ్ తరుణ్ కేరక్టర్ ఇదే అని తెలుస్తోంది. కుక్కలను కిడ్నాప్ చేయడం.. ఈ కుర్రాడికి హాబీ కూడా కాదు.. ఏకంగా ప్రొఫెషన్ కూడా ఇదే అంటున్నారు. ఇలాంటి వింత కేరక్టరైజేషన్ తో రాజ్ తరుణ్ సినిమా చేస్తుండడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.

వంశీకృష్ణ దర్శకత్వంలో ఏకే ఎంటర్టెయిన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తికాగా.. ఈమూవీలో ఓ ప్రధాన పాత్ర కోసం సీనియర్ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ కేరక్టర్ ఫైనల్ కాగానే రెండో షెడ్యూల్ ని ప్రారంభించనున్నాడు రాజ్ తరుణ్.
Tags:    

Similar News