ఏప్రిల్ నుంచి మ‌హేష్ మూవీ పై జ‌క్కన్న బిజీ!

Update: 2023-02-17 12:28 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ నేప‌థ్యంలో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రంగా తెర‌కెక్కించ‌బోతున్నారు. 2024 మిడ్లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి  తీసుకెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. అయితే రాజ‌మౌళి ప్ర‌స్తుతం 'ఆర్ ఆర్ ఆర్' కి ఆస్కార్ అవార్డు తెచ్చే ప‌నుల్లో బిజీగా ఉండ‌టంతో మ‌హేష్ ప్రాజెక్ట్ పై సీరియ‌స్ గా ప‌నిచేయ లేదు.

కొన్ని నెల‌లుగా అమెరికాలోనే తిష్ట వేసి అవార్డు కోసం శ‌త‌విధాల త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఆయ‌న శ్ర‌మ‌కి త‌గ్గ ఫ‌లిం దిశ‌గానూ అడుగులు ప‌డుతున్నాయి. అయితే మార్చి నెలాఖ‌రుక‌ల్లాఖాళీ అవుతాను.

మార్చి 13న జ‌రిగే లాస్ ఎంజెల్స్ ఆస్కార్ అవార్డు వేడుక‌ల ప్ర‌క‌ట‌న అనంత‌రం రాజ‌మౌళి ఇండియాకి తిరిగి రానున్నారు. ఆ త‌ర్వాత కొద్ది రోజులు  విశ్రాంతి తీసుకుని మ‌హేష్ సినిమా ప‌నుల్లో బిజీ కానున్నారు.

అంటే ఏప్రిల్ నుంచి ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభమ‌వుతాయ‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.  న‌టీన‌టులు..సాంకేతిక నిపుణులు..అవ‌స‌ర‌మైన విదేశీ బృందం స‌హా అన్ని విష‌యాల‌పై ఏప్రిల్ లో నిర్ణ‌యం తీసుకునే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

ఈసారి గ‌తంలా కాకుండా పక్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాల‌ని....ఎన్ని అడ్డంకులు ఎదురైనా వేసుకున్న ప్ర‌ణాళిక త‌ప్ప‌క అమ‌లు ప‌ర‌చాయ‌ల‌ని జ‌క్క‌న్న స్ర్టాంగ్ గా ఉన్న‌ట్లు స‌మాచారం.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' విష‌యంలో దొర్లిన‌ త‌ప్పిదాలు దొర్ల‌కుండా మ‌హేష్ చిత్రాన్ని అనుకున్న తేదికి రిలీజ్ చేసేలా ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే సినిమా షూటింగ్ ఎక్కువ‌గా భాగం ఆఫ్రికా ఖండంలోనే ఉంటుంద‌ని స‌మాచారం. అవ‌స‌రం మేర హైద‌రాబాద్ లో కొన్ని సెట్స్ వేసి  పూర్తి  చేయాల‌న్నది ప్లాన్ గా తెలుస్తోంది. ఈ క‌థ‌ని కూడా ఓ ప్రాంచైజీలా మ‌లిచే అవ‌కాశం ఉంద‌ని సోర్సెస్ చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News