'బాహుబలి'తో భారతీయ సినిమా అంటే విదేశీ ప్రేక్షకులు ఆశ్చర్యంతో చూసేలా చేశాడు జక్కన్న. ఈ సిరీస్ సినిమాలతో దేశ వ్యాప్తంగా సరికొత్త సంచలనాలకు తెర లేపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలుగు సినిమాని సైతం శిఖరాగ్రాన నిలబెట్టి టాలీవుడ్ అంటూ యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా చూసేలా చేశారు. ఈ మూవీల తరువాతే తెలుగు సినిమా దశ, దిశ కూడా మారింది. మార్కెట్ స్థాయి కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.
దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు సరికొత్త ఇమేజ్ ని, క్రేజ్ ని తెచ్చిపెట్టిన జక్కన్న రీసెంట్ గా మరో ఘనతని సాధించడం ఇప్పడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. రాజమౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినటు వంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల తొలి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ 'RRR'.
ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల ఫిక్షనల్ స్టోరీని అత్యంత ప్రభావ వంతంగా తెరకెక్కించిన తీరు మన దేశ ప్రేక్షకులనే కాకుండా విదేశీ సినీ ప్రియుల్ని కూడా అమితంగా ఆకట్టుకుంటూ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్, టెక్నీషయన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా మరింత వైరల్ చేస్తూ సినిమాని హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. రీసెంట్ గా ఈ మూవీని జపాన్ లోనూ భారీ యోత్తున రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి జపాన్ లో ఈ మూవీని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
అక్కడ కూడా 'RRR' రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీని ఎలాగైనా ఆస్కార్ బరిలో నిలపాలని రాజమౌళి భారీ స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి కూడా రాజమౌళి వెనుకాడటం లేదంటూ వరుస కథనాలు వినిపిస్తున్న వేళ హాలీవుడ్.. మీడియా జక్కన్నకు సలాంకొడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ లో జక్కన్న పని చేసే అవకాశం వుందంటూ లాస్ ఏంజిల్స్ కు చెందిన టైమ్స్పత్రిక ఫ్రంట్ పేజీలో రాజమౌళి ఫొటోని ప్రచురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
'హెడ్పాఇబులిటీస్ ఫర్ 'RRR" అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం విశేషం. ఈ ప్రత్యేక కథనాన్ని వీక్షించిన మన వారు భళా జక్కన్నా భళా..హాలీవుడ్ హాట్ ఫేవరేట్ అయ్యాడని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'RRR'కు ఆస్కార్ ఎంట్రీ కోసం రాజమౌళి విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ ప్రఖ్యాత లాస్ ఏంజీల్స్ కు చుందిన టైమ్స్ పత్రికలో రాజమౌళిపై ప్రత్యేక కథనం ప్రచురించడం శుభ పరిణామంగా చెబుతున్నారు. జక్కన్న ఫొటోని ప్రత్యేకంగా హాఫ్ పేజీ మొత్తం డిజైన్ చేసి ఈ కథనాన్ని ప్రచురించడంతో అంతా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.