దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన ఘనుడిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆయన పేరు హెడ్ లైన్స్ లోకి రాని రోజు లేదు. భారతదేశపు అద్భుత దర్శకుడు రాజమౌళి సృష్టించిన ప్రభావం అలాంటిది.
RRR దేశవిదేశాల్లో గొప్పగా ప్రజలకు చేరువయ్యిందంటే ఆయన మేకింగ్ విజన్ కారణం. రాజమౌళికి ఇప్పుడు పాశ్చాత్య ప్రేక్షకులలో కూడా గొప్ప గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే పలువురు టాప్ క్లాస్ హాలీవుడ్ ఫిలింమేకర్స్ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ తారలు అతడి పనితనాన్ని కీర్తించారు.
ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు ఎస్.ఎస్ రాజమౌళి. పాపులర్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమా గురించి తన సినీ కెరీర్ గురించి రాజమౌళి ప్రసంగం చేయడానికి ఆహ్వానితుడయ్యారు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కెనడాలో ఈ సెప్టెంబర్ లో జరగనుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-క్లాస్ టెక్నీషియన్స్ అందరూ హాజరవుతారు.
ప్రస్తుతం భారతీయ సాంకేతిక నిపుణుడి కేటగిరీలో ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి రాజమౌళి అని సమాచారం. అలాగే RRR టొరొంటోలో ప్రదర్శిస్తారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. రాజమౌళి పదే పదే తెలుగు సినిమా స్థాయిని ఉన్నత స్థాయికి పెంచుతున్నాడు.
దీనితో చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత దర్శకనిర్మాతలు మన సినిమాల గొప్పతనం నాణ్యత గురించి తెలుసుకుంటారు. దీనివల్ల తెలుగు సినిమా మార్కెట్ కూడా విస్త్రతమవుతుంది.