రాజమౌళి అనే పేరు వినిపిస్తే చాలు.. దాని చుట్టూ ఉన్న సమాచారం కోసం ఆసక్తిగా చూస్తారు జనాలు. ‘బాహుబలి’ సినిమాతో అలాంటి గుర్తింపు సంపాదించాడు జక్కన్న మరి. ఆయన ఏదైనా సినిమా గురించి పాజిటివ్ గా ఒక మాట మాట్లాడాడంటే చాలు.. అది పెద్ద సర్టిఫికెట్ అయిపోతుంది. ప్రచారానికి భలేగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తమ సినిమా చూడాలని.. ఒక కామెంట్ చేయాలని అందరూ ఆశపడతారు. ఐతే రాజమౌళి మాత్రం చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుని చూస్తాడు. తన సన్నిహితులవి.. తనకు అభిరుచికి తగ్గవి మాత్రమే ఎంచుకుని ప్రసాద్ ఐమాక్స్ లో కుటుంబంతో కలిసి 8.45 షో చూస్తుంటాడు.
ఐతే ‘బాహుబలి’లో కీలక పాత్రధారి అయిన రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన ‘ఘాజీ’ సినిమాను రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోవడం.. దాని గురించి మాట్లాడకపోవడం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోందిపుడు. ‘పెళ్లిచూపులు’ లాంటి చిన్న సినిమాను కూడా వీలు చూసుకుని చూసి.. దాని గురించి స్పందించిన జక్కన్న ‘ఘాజీ’ గురించి ఎందుకు మాట్లాడలేదబ్బా అంటున్నారు జనాలు. జక్కన్న సైలెన్స్ కూడా ఇప్పుడు పెద్ద వార్తయిపోయింది. దీన్ని బట్టి రాజమౌళికి.. రానాకు టెర్మ్స్ సరిగా లేవేమో అన్న రూమర్లు కూడా పుట్టించేస్తున్నారు జనాలు. ఐతే కేవలం ఒక సినిమా చూసి స్పందించనంత మాత్రాన ఇలా వార్తలు పుట్టించేయడం ఎంత సబబో ఆలోచించాలి. ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్ట్ ప్రొడక్షన్ మీదే ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సిన నేపథ్యంలో రాజమౌళి వేరే విషయాలేవీ పట్టించుకోకుండా దాని పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాడన్నది యూనిట్ వర్గాల సమాచారం. కాబట్టి వీలు చిక్కినపుడు ‘ఘాజీ’ చూసి తన స్పందన తెలియజేయకపోడు. అంత వరకూ వెయిట్ చేయడం బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/