చరణ్‌ కి నో చెప్పిన రాజమౌళి

Update: 2019-02-16 06:27 GMT
తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది రాజమలి RRR సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ మాత్రమే అఫీషియల్‌ గా ఫైనల్‌ అయ్యారు. హీరోయిన్లుగా చాలామంది పేర్లు బయటకు వచ్చినా.. అవేవీ ఇంకా ఫైనల్‌ కాలేదు. టాలీవుడ్‌ లో హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ ఇద్దరూ బాక్సర్లుగా కన్పించబోతున్నారని టాక్‌. దీంతో.. ఈ సినిమా కోసం ఇద్దరూ హీరోలు బాక్సర్లుగా మేకోవర్‌ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. మేకోవర్‌ ఓన్లీ ఎన్టీఆర్‌ కేనట. రామ్‌ చరణ్‌ కు మేకోవర్‌ అవసరం లేదని చెప్పాడట రాజమౌళి.

 బాక్సర్‌ అంటే బీభత్సమైన రేంజ్‌ లో కండలు ఉండాలి. రామ్‌ చరణ్‌ ఇప్పటికే కంప్లీట్‌ ఫిట్‌ గా ఉన్నాడు. తారక్‌ మాత్రం కాస్త చబ్బీగా తయారయ్యాడు. అరవింత సమేత కోసం కండలు పెంచాడు కానీ.. అవీ రాజమౌళి సినిమాకు సరిపోవు. ఎందుకంటే.. అరవింత సమేతలో సన్నగా ఉంటూ కండలు పెంచాడు. కానీ రాజమౌళి సినిమాకు వచ్చేవరకు.. భారీ ఆకారంతో కండలు ఉండాలి. అంటే ఒళ్లు ఉండాలి.. అదే టైమ్‌ లో అదిరిపోయే రేంజ్‌ లో మజిల్స్ కూడా ఉండాలి. అందుకే.. తారక్‌ ను మేకోవర్‌ కావాల్సిందేనని సూచించాడట రాజమౌళి. ప్రస్తుతం ఫ్యామిలీతో వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న తారక్‌.. మరో వారం రోజుల్లో మేకోవర్‌ కోసం సిద్ధం కాబోతున్నాడు.
Tags:    

Similar News