పార్టీ ప్రకటనపై రజినీకాంత్ డిసైడ్?

Update: 2020-12-28 04:15 GMT
లక్షలాది మంది అభిమానులకు.. సినీ రాజకీయ వర్గాలకు ఉపశమనం కలిగించేలా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో షూటింగ్ కు వచ్చిన ఆయన అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి చెన్నైలోని ఇంటికి చేరారు. రజినీకాంత్ హైబిపి స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయి. అలసట ఉండొద్దని వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రజినీకాంత్ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయితే రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై డిసెంబర్ 31న చెన్నైలోని తన రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో ప్రకటన చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. ఈ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా అభిమానులు తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రకటనలో తన పార్టీ పేరు, గుర్తు, రాజకీయ ప్రకటన చేస్తాడని భావిస్తున్నారు. అయితే, సడెన్ గా రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతినడం.. తాజా పరిణామాల కారణంగా పార్టీ ప్రకటన ప్రణాళికలను రజినీ రద్దు చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే రజినీకాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31నాడే పార్టీ ప్రకటన చేస్తాడని.. తమిళ రాజకీయాల్లో ముందుకు వెళ్తారని కోలీవుడ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం సంచలనం మారింది. అభిమానులతో బహిరంగ సమావేశానికి బదులుగా రజినీ తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు.. జనవరి మూడవ వారంలో రజిని తన పార్టీని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.


Tags:    

Similar News