తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత దశాబ్దకాలంగా సినిమాలను చాలా మెల్లగా చేస్తూ వచ్చాడు. సంవత్సరంకు ఒకటి లేదా రెండు మూడు సంవత్సరాలకు ఒకటి చొప్పున చేశాడు. కాని ఇప్పుడు సంవత్సరంలో ఏకంగా రెండు మూడు సినిమాలను కూడా విడుదల చేసేలా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. సంక్రాంతికి 'దర్బార్' చిత్రంతో రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దర్బార్' చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే.
ఒక వైపు దర్బార్ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మరో వైపు శివ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చింది. జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉండవచ్చు అనుకున్నారు. కాని అనూహ్యంగా నేటి నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రజినీకాంత్ నేడు షూటింగ్ లో పాల్గొన్నాడు.
రెండు వారాల షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అజిత్ కు ఎన్నో భారీ సక్సెస్ లను అందించిన దర్శకుడు శివ మొదటి సారి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. దర్బార్ చిత్రంలో పోలీస్ గా కనిపించబోతున్న రజినీకాంత్ శివ దర్శకత్వంలో వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించబోతున్నాడట. షూటింగ్ చాలా స్పీడ్ గా జరిపి వచ్చే ఏడాది వేసవి చివర్లో లేదంటే దీపావళికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ లో ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. రజినీకాంత్ స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
యంగ్ స్టార్ హీరోలు రజినీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్స్ సూచిస్తున్నారు. 2020లో దర్బార్.. శివ దర్శకత్వంలో సినిమాలతో పాటు మరో సినిమాను కూడా చేస్తాడంటూ తమిళ మీడియాలో టాక్ నడుస్తోంది. త్వరలో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు. అందుకే అప్పటి వరకు సాధ్యం అయినన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడని.. అందుకే ఈ స్పీడ్ అంటూ తమిళ సినీ విశ్లేషకులు అంటున్నారు.