బ్యూటీ అవార్డ్‌ వేడుకలో రకుల్‌ అహా అనిపించింది

Update: 2022-11-17 05:30 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు అయిదు సంవత్సరాల పాటు ఓ రేంజ్ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈ మధ్య కాలంలో పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది.

హీరోయిన్ గా ఈఅమ్మడు చేస్తున్న సినిమాలు హిందీలోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే హిందీలో ఈమె నటించిన సినిమాలు కొన్ని విడుదల అయ్యాయి. అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

హిందీలో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడే పర్మినెంట్‌ హీరోయిన్ గా నిలిచి పోతుందనే టాక్ వినిపిస్తుంది. సౌత్‌ లో ఆఫర్స్‌ రాకపోవడం వల్లే ఇక్కడ చేయడం లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ విషయాలు పక్కన పెడితే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత అదుర్స్‌ అన్నట్లుగా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు బాలీవుడ్‌ ను క్రాస్ చేసి హాలీవుడ్‌ రేంజ్ లో అన్నట్లుగా అందాల విందు చేస్తోంది. తాజాగా ఎల్లే బ్యూటీ అవార్డ్స్ 2022 వేడుకల్లో భాగంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మోడ్రన్ డ్రెస్‌ లో కనిపించి సందడి చేసింది. బ్యూటీ అవార్డ్‌ వేడుకలో ఈ మాత్రం బ్యూటీగా కనిపించకుంటే ఎలా అన్నట్లుగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలా స్టైల్‌ గా మోస్ట్‌ మోడ్రన్ డ్రస్ ల్లో సందడి చేస్తూ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ యొక్క వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

పెద్ద ఎత్తున అందాల ఆరబోత చేసే ఈ అమ్మడికి తెలుగు లో ఎందుకు ఆఫర్స్ రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ లో అయినా ఈ అమ్మడు మరింత సక్సెస్ అయ్యి మళ్లీ సౌత్‌ లో ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News