మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ అంటూ ఇప్పటిదాకా చాలా పేర్లు వినిపించాయి. ఈ మధ్యే పరిణీతి చోప్రా పేరు ఖరారైనట్లు.. ఆమెకు రూ.3.5 కోట్ల పారితోషకం ఇవ్వడానికి కూడా అంగీకారం కుదరినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ విషయాన్ని మురుగదాస్ కానీ.. మహేష్ కానీ.. నిర్మాతలు కూడా కన్ఫమ్ చేయలేదు. ఇంతలో ఈ సినిమాలో హీరోయిన్ అంటూ కొత్త పేరు తెరమీదికి వచ్చింది. టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ సినిమాకు హీరయిన్ గా పరిశీలిస్తున్నారట. పరిణీతికి అంతిచ్చి తెచ్చుకున్నా.. సౌత్ ఆడియన్స్ ఆమెతో పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చని.. దాని కన్నా ఇక్కడి హీరోయిన్నే ట్రై చేస్తే పోలా అని మురుగదాస్ ఆలోచిస్తున్నాడట.
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఇక్కడ పాపులర్ కాబట్టి.. మహేష్ పక్కన ఆమెకు జోడీ కూడా కుదిరే అవకాశముండటంతో ఒకసారి చూద్దాం అని ఆమెతో మేకప్ టెస్టు కూడా చేసినట్లు సమాచారం. పారితోషకం కూడా తక్కువ కావడంతో బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుందని ఆలోచిస్తున్నారట. రకుల్ ఇప్పటికే మహేష్ తో ఓసారి నటించాల్సింది. కానీ అప్పట్లో డేట్లు సర్దుబాటు చేయలేక మహేష్ సినిమాను వదులుకున్నట్లు ఆమె చెప్పింది. ఇప్పుడు మహేష్ తో నటించే అవకాశం అంటే.. రెమ్యూనరేషన్ ఇంకా కట్ చేసుకోవడమే కాక.. డేట్ల విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించే అవకాశముంది. పరిణీతితో అంటే ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ చేసేయాలి. లేదంటే అదనపు పారితోషకం కోసం గొడవ మొదలవుతుంది. అందుకే అన్ని రకాలుగా అందుబాటులో ఉండే రకుల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.