కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న విషయం తెలిసిందే. ఆమెకి కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు. వెంటనే జిమ్ లో వాలిపోతుంటుంది. ఆ అభిరుచే ఆమెని ఓ సొంత జిమ్ కి ఓనర్ ని చేసింది. హైదరాబాద్ కి వస్తే సొంత జిమ్ములోనే కసరత్తులు చేస్తుంటుంది రకుల్. షూటింగ్ ల కోసం ఔట్ డోర్స్ కి వెళ్లినా సరే ఆమె కసరత్తులు చేయడం మాత్రం మానదు. అక్కడే ఎక్కడో ఓ జిమ్ ని చూసుకొని వ్యాయామాలు చేసుకొంటుందట. అదీ కుదరకపోతే సెట్లోనే వాకింగ్ సైక్లింగ్ ల్లాంటివి చేసుకొంటూ గడుపుతుందట. ఇటీవలే ధ్రువ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లింది రకుల్. అక్కడ కొన్ని పాటల్ని షూట్ చేస్తున్నారు.
అయితే అక్కడ కూడా ఫిట్ నెస్ పై బాగానే దృష్టిపెడుతోంది రకుల్. సెట్ నుంచి హోటల్ రూమ్ కి సైకిల్ పైనే వెళ్లింది. సెట్ నుంచి హోటల్ కి ఐదారు కిలోమీటర్ల దూరమున్నప్పటికీ, కాశ్మీర్ లో అది తెలియని ప్లేసయినా రకుల్ మాత్రం సైకిల్ తొక్కుతూనే వెళ్లింది. సైక్లింగ్ తో ఒక ప్రయోగం చేశానని రకుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మొత్తంగా హీరో హీరోయిన్లు రామ్ చరణ్ - రకుల్ లు ఇద్దరూ కూడా కాశ్మీర్ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాతావరణాన్ని - షూటింగ్ ప్రొగ్రెస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొంటూ ఎంజాయ్ చేస్తున్నారు.