చరణ్ ప్రణాళికలు జెట్ స్పీడ్ అందుకుంటున్నాయి. ఈ మెగా హీరో కెరీర్ పరంగా ఒక్కో అడుగూ ఆచితూచి వేస్తున్నా వాటి వెనుక బలమైన ప్రణాళికలు పక్కాగా నడుస్తున్నాయనడానికి ఇదే తాజా ఉదాహరణ. ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు.. ఇలా నిజజీవితంలో ద్విపాత్రాభినయం చేస్తూ యువహీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలివైన పెట్టుబడి ఎలా పెట్టాలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాడు. పదండి ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం అమెరికాలో తానా, నాట్స్ మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో దేశవిదేశాల్లో ఉన్న ఇండియన్ల(ఎన్నారైలు)ంతా పాల్గొంటున్నారు. అలాగే సినీ,రాజకీయ, పారిశ్రామిక వేత్తలు విచ్చేస్తున్నారు. ఇప్పటికే సభలు ప్రారంభమయ్యాయి. మరో రెండురోజుల పాటు నిరంతరాయంగా సభలు సాగుతూనే ఉంటాయి. అయితే చరణ్ మాష్టర్ మైండ్ ఇక్కడే చురుగ్గా పనిచేసింది. అందివచ్చిన అవకాశాన్ని తెలివిగా వినియోగించుకోవడం ఎలా? అని ఆలోచించిన చరణ్ ఒక్కసారిగా 'ట్రూజెట్'ని రంగంలోకి దించాడు.
డొమస్టిక్ డెస్టినేషన్స్ పయనించే విమానయాన సర్వీస్ ట్రూజెట్. తక్కువ టిక్కెట్ ధరతోనే ప్రయాణించే సౌలభ్యం అంటూ తానా, నాట్స్ ఉత్సవాల్లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విమానాశ్రయాలు, బస్ కాంప్లెక్సులు తదితర చోట్ల హోర్డింగులతో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు అత్యంత ఖరీదైన, అత్యంత ప్రతిష్ఠ్మాకమైన ఎన్నారైల ఉత్సవాల్లో ప్రచారానికి పూనుకున్నాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. చెర్రీ ప్లాన్ అదుర్స్ కదూ?