2022..ఈ ఏడాది కొంత మంది హీరోలని పాన్ ఇండియా స్టార్లుగా మారిస్తే మరి కొంత మందికి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ఇక సీనియర్ హీరోల్లో కొందరికి హిట్ సినిమాలని అందిస్తే మరి కొందరిని డిజాస్టర్లని ఎదుర్కొనేలా చేసింది. ఈ ఏడాది చాలా వరకు బిగ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. భారీ విజయాల కోసం ప్రయత్నించారు. కానీ అందులో ఇద్దరు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయారు.
అయితే వచ్చే ఏడాది అంటే 2023లో మాత్రం ముగ్గురు బిగ్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ రేసులో దిగడం లేదు. వారి సినిమాల ప్లానింగ్ పూర్తిగా మారడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా సెన్సేషన్ `RRR`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గ్లోబల్ గా ఈ మూవీ రికార్డులు సృష్టించడంతో వీరిద్దరి క్రేజ్ పతాక స్థాయికి చేరింది.
ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో తమ తదుపరి ప్రాజెక్ట్ లని ప్రారంభిస్తారని వారి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో తన క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నా ఈ మూవీ కమల్ హాసన్ `ఇండియన్ 2` కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. అంతకు ముందు వరకు ఫుల్ జోష్ తో సాగిన ఈ మూవీ షూటింగ్ వన్స్ శంకర్ `ఇండియన్ 2`కు షిఫ్ట్ అయ్యాక మందగించింది.
అంతే కాకుండా దర్శకుడు శంకర్ టెక్నీషియన్స్ ని మార్చిన కారణంగా దిల్ రాజుకు తనకు మధ్య గ్యాప్ ఏర్పడిందని, ఆ విభేదాల్ని పరిష్కరించుకుని, `ఇండియన్ 2`ని పూర్తి చేసి చరణ్ సినిమా పట్టాలెక్కడానికి టైమ్ పట్టేలా వుందని దీంతో ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కావడం కష్టం అనే వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ పరిస్థితి ఇలా వుంటే ఎన్టీఆర్ పరిస్థితి మరీ భిన్నంగా వుంది. `RRR` తరువాత ఎన్టీఆర్ స్పీడు పెంచేస్తాడనుకుంటే తను కొరటాల శివతో చేయాలనుకున్న 30వ ప్రాజెక్ట్ ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు.
అదుగో ఇదుగో అనే వార్తలు వినిపిస్తున్నాయే కానీ కొరటాల శివ కానీ, యువ సుధా ఆర్ట్స్ వారు కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా 2023లో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ పరిస్థితి మరోలా వుంది. తనని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన `పుష్ప ది రైజ్` కు బన్నీ కొనసాగింపుగా `పుష్ప 2`ని మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 2`ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని, విదేశాల్లో కీలక ఘట్టాలని తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ తన ప్లాన్ ని మార్చేశాడు. దీంతో ముందు అనుకున్న సమయానికి కాకుండా ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళుతోంది. దీపావళి తరువాత నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని 2023 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. కానీ అది జరిగే పనిలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీని 2024 సంక్రాంతి రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే 2023లో బన్నీ సినిమా లేనట్టే అన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.