ఆ అగ్రిమెంట్ తో చరణ్ కు 2 కోట్లు

Update: 2018-05-24 07:05 GMT
రెండున్నర గంటల పాటు సాగే సినిమా కోసం.. యాక్టర్లు.. టెక్నికల్ టీం నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. సినిమా ద్వారా వచ్చే మొత్తం పెద్దదే అయినా.. రోజుల వారీగా లెక్క పెట్టుకుంటే.. ఆయా తార ఇమేజ్ ప్రకారం.. రీజనబుల్ గానే అనిపిస్తుంది. కానీ అంతటి ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత బ్రాండ్ అండార్స్ మెంట్స్ చేసుకోవడం ద్వారా గట్టి మొత్తం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది.

చాలామంది హీరోలు అటు సినిమాలతో పాటు ఇటు యాడ్స్ కూడా చేస్తుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం యాడ్స్ విషయంలో ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపించడు. కెరీర్ ప్రారంభంలో పెప్సీ యాడ్ చేసిన తర్వాత.. మళ్లీ ఎప్పుడూ ఏ ఉత్పత్తికీ ప్రచారం చేస్తూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఓ మొబైల్ రీటైలర్ కు ప్రచారం చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ.. R C అనే అక్షరాలు సీక్రెట్ ను బయటపెట్టేశాయి. ఈ డీల్ కోసం రామ్ చరణ్ 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని అంటున్నారు.

మహా అయితే ఓ 2-3 రోజుల షూటింగ్.. రెండు మూడు ప్రెస్ మీట్లు.. ఒకటి రెండు లాంఛింగ్స్.. అవి కూడా ఇతరేతర ఖర్చులన్నీ ఆయా కంపెనీలే భరిస్తాయి కాబట్టి.. ఇది పెద్ద మొత్తమే అవుతుంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో.. ఇప్పటికే మహేష్ బాబు లీడింగ్ లో ఉండగా.. అల్లు అర్జున్ కూడా దూసుకుపోతున్నాడు.  వీరితో పోల్చితే రామ్ చరణ్ కి ఆఫర్ చేసిన మొత్తం తక్కువే అని టాక్.
Tags:    

Similar News