2020 మోస్ట్ అవైటెడ్ మూవీ RRR పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ఎందులోనూ రాజీకి రాకుండా తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు- నైజాం గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్రల్ని అవసరం మేర డ్రమటైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి పాత్రలో రామ్ చరణ్-కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన నభూతోనభవిష్యతి అన్న తీరుగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్- పులితో తలపడిలే సన్నివేశాల గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 300 స్ఫూర్తితో ఇందులో పులి ఫైట్ ని తెరకెక్కించారన్న చర్చా సాగుతోంది. పులితో పోరాట సన్నివేశం లైవ్ గా చూస్తున్న అనుభూతిని కల్గించేలా తెరకెక్కించారని ముచ్చటించుకుంటున్నారు.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ బ్రిటీష్ పోలీస్ గా కనిపించనున్నాడని .. లేదు భగత్ సింగ్ తరహా పాత్రలో కనిపిస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దేవగణ్ పాత్ర చిత్రణ హైలైట్ గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్- అజయ్ దేవగణ్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసారు. తాజాగా 5 నుంచి 8 నిమిషాల పాటు ఖాకీ డ్రెస్ తొడుక్కున్న రామ్ చరణ్ పైనా కొన్ని సీన్లు తెరకెక్కించారని సమాచారం.
సన్నివేశం డిమాండ్ మేరకు చరణ్ ఖాకీలో కనిపంచనున్నాడని తెలుస్తోంది. బ్రిటీష్ పాలకుల ముందుకు రొమ్ములు విరుచుకుంటూ ఎదురెళ్లిన విప్లవ కారుడు సీతా రామరాజు(చరణ్) ఖాకీ ధరించడం ఏమిటి అంటే.. దానికి ప్రత్యేక కారణం ఉంది. అల్లూరి ఎంత పొరాట పటిమగల వీరుడో.. బ్రిటీష్ పాలకుల ఎత్తుగడల్ని చిత్తు చేయడం లో.. శత్రువు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలోనూ అంతే దిట్టే. అలా బ్రిటీష్ పోలీసుల ఎత్తుగడలను తెలుసుకునేందుకు సీతా రామరాజు (చరణ్) ఖాకీ ధరిస్తాడట. ఈ సన్నివేశాన్ని అజయ్ దేవగణ్-చరణ్ పై ఈ వారం లో చిత్రీకరించనున్నారని తెలిసింది. ఖాకీలో చరణ్ కనిపిస్తున్నంత సేపు అభిమానుల్లో ఊపు కనిపించడం ఖాయమనే అంటున్నారు. ఇటు ఎన్టీఆర్ టైగర్ తో ఫైట్.. అటు చరణ్ డమ్మీ ఖాకీ అధికారిగా ఆంగ్లేయుల్ని మభ్య పెట్టే నటన సంథింగ్ స్పెషల్ గా ఉంటాయన్న చర్చ సాగుతోంది. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.