ఏ విషయంపై అయినా అందరూ ఒకలా మాట్లాడితే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడే విధానం మరోలా ఉంటుంది. టాపిక్ ఏదైనా సరే స్పందన డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఇక నేరుగా ప్రశ్న అడిగితే.. ఆ అడిగిన వాళ్లు తల పట్టుకోవాల్సిందే. ప్రస్తుతం కిల్లింగ్ వీరప్పన్ మూవీ ప్రమోషన్లలో బాగా బిజీగా ఉన్నాడు వర్మ. కన్నడ. తెలుగు ఛానల్స్ ని తెగ చుట్టేస్తున్నాడు. తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంలో వర్మకు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. "రీసెంట్ గా మీరు తీసినవి కూడా కలిపి చెత్త సినిమాలు చూసేటపుడు ఆడియన్స్ ఫీలవ్వరా, వాళ్లిచ్చిన వంద రూపాయలు నష్టపోతే వాళ్లకి బాధ ఉండదా" అని వర్మని అడిగారు. "ఇక్కడ ప్రేక్షకుడు నష్టపోయేది వంద రూపాయలు మాత్రమే. కానీ ఆ సినిమా తీసేవాళ్లు కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఆడియన్స్ కి సినిమా నచ్చకపోతే ఇంటర్వెల్ నుంచి వెళ్లిపోవచ్చు. కానీ మేకర్స్ సంగతి అలా కాదు. మొత్తం తీయాల్సిందే. ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కోవాల్సిందే " అంటున్నాడు వర్మ.
అంతే కాదు "సినిమా తీసేవాళ్ల కంటే ఆడియన్స్ కి స్వేచ్ఛ ఎక్కువ. ఇక్కడ మేకర్స్ అనుభవించే టార్చర్ తో పోల్చితే, ప్రేక్షకులు భరించేది అసలేం లేదనాలి" అంటూ డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. వర్మ చెప్పిన ఈ సంగతిని అందరూ అంగీకరించకపోవచ్చు. కానీ అందులోనూ నిజం ఉందిగా అంటున్నారు కొంతమంది. మరి ఈ విషయంలో రాంగోపాల్ వర్మకు ఎవరైనా మేకర్స్ మద్దతు పలుకుతారో లేదో ?