చిరంజీవి స్పీచ్.. వర్మ పంచ్

Update: 2016-03-21 10:40 GMT
మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ వేడుక జరిగినా.. ఇంకేదైనా పరిణామాలు చోటు చేసుకున్నా.. వెంటనే జనాలందరూ రామ్ గోపాల్ వర్మ స్పందన కోసం ఎదురు చూడటం ఈ మధ్య మామూలైపోయింది. చిరంజీవి - పవన్ కళ్యాణ్ ల గురించి వర్మ చేసే వ్యాఖ్యలు అంత ఆసక్తి రేపుతుంటాయి మరి. ఈ మధ్య కాలంలో ఆయన అత్యధికంగా ట్వీట్లు గుప్పించింది పవన్ - మెగా ఫ్యామిలీ వ్యవహారాల గురించే.

తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక సందర్భంగా హాట్ టాపిక్ గా మారిన అన్నదమ్ముల ప్రసంగం.. వారి అనుబంధం గురించి కూడా వర్మ రెస్పాండయ్యాడు. వర్మ ప్రకారం చిరంజీవి ప్రసంగం అంత ఒరిజినల్ గా లేదట.. పవన్ మాటల్లో మాత్రం ఒరిజినాలిటీ ఉందట. కానీ అన్నదమ్ముల అనుబంధం మాత్రం బాగా వర్కవుటైందన్న అర్థంలో తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు వర్మ. ‘‘పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. మెగా స్పీచ్ పవర్ ఫుల్లీ అన్ ఒరిజినల్. కానీ అన్నదమ్ముల అనుబంధంమాత్రం మెగా పవర్ ఫుల్ గా వర్కవుటైంది’’ అని వ్యాఖ్యానించాడు వర్మ.

ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ గురించి కూడా వర్మ స్పందించడం విశేషం. ‘‘సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ బెస్ట్ కంటే బ్యాడ్ గా ఉంది. ఫెంటాస్టిక్ కంటే వరస్ట్ గా ఉంది.. అసాధారణ సాధారణంగా ఉంది.. ఐతే ఇంటెంట్ పరంగా ట్రెమండస్. జై పీకే’’ అంటూ ట్రైలర్ ను పొగిడాడో తిట్టాడో తెలియనట్లుగా ట్వీట్ పెట్టాడు వర్మ.
Tags:    

Similar News