కొన్ని సందర్భాలు మళ్లీ మళ్లీ అదే విధంగా చోటు చేసుకుంటుంటే మాత్రం.. మనకు షాక్ అనిపిస్తుంటుంది. కాని రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు దర్శకులు మాత్రం.. తెలిసి చేస్తారో కావాలనే చేస్తారో లేక వారు ఏం ప్లాన్ చేసినా అలా జరుగుతుంటుందో తెలియదు కాని.. వారు చేసేవి ఎన్ని సంవత్సరాలకైనా ఒకేలా ఉంటాయి.
గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాను మొదలెట్టాడు వర్మ. సరిగ్గా రెండు పాటలు చిరు అండ్ ఊర్మిళ మీద షూట్ చేశాక.. అప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న సంజయ్ దత్.. బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అంతే.. వెంటనే వర్మ ఇక్కడ నుండి జండా పీకేసి.. బాంబే వెళ్లిపోయాడు. అక్కడ 'దౌడ్' అంటూ ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాను సంజయ్ తో తీసి.. అదేదో స్నేహానికి బీభత్సమైన కానుక అన్నట్లు కటింగ్ ఇచ్చాడు. ఇది 1996 నాటి మాట.
కట్ చేస్తే.. ఇప్పుడు 2016లో.. అసలు తెలుగులో ఏ సినిమాలూ లేక జెండా పీకేసుకుని బొంబాయిలో 'కంపెనీ' అంటూ కొత్త ఆఫీస్ కట్టుకొని అక్కడ తేలాడు వర్మ. సరిగ్గా ఇదే సమయంలో సంజయ్ దత్ ఫైనల్ శిక్షను అనుభవించి రిలీజ్ అవుతున్నాడు. ఒకవేళ వర్మ అక్కడ చేరడం అనేది కేవలం యాక్సిడెంటల్ గా జరిగిందా.. లేకపోతే సంజయ్ తో మళ్లీ ఏదైనా సినిమా తీస్తున్నాడా అనే సందేహం రాకమానదు.