రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా శ్రీదేవిపై తనకున్న అభిమానంను గురించి చెబుతూనే ఉంటాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు పెళ్లి బంధాన్ని.. పెళ్లి అనే వ్యవస్థను విమర్శించే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి అదే మాటలను చెప్పుకొచ్చాడు. పెళ్లి అనే ఒక బంధం వల్ల ఇద్దరి మద్య శారీరకంగా సన్నిహిత్యం పెరుగుతుంది కాని మానసికంగా మాత్రం సన్నిహిత్యం పెరగడదు అన్నాడు. ఇక వర్మ ఎప్పుడు కూడా ముక్కు సూటిగా తనకు ఏదైతే అనిపిస్తుందో అదే మాట్లాడేస్తాడు. రామ్ గోపాల్ వర్మ ఒకానొక సమయంలో తన భార్య వద్ద కూడా అలాగే మనసులో ఉన్న విషయంను బయటకు అనేశాడట. దాంతో ఆమెచే చెంపదెబ్బ కూడా తిన్నాడట.
వర్మ మాట్లాడుతూ... పెళ్లి అయిన తర్వాత ఇష్టాల్లో మార్పులు.. కొన్నింటిని వదిలేయడం మరికొన్నింటిని దాచేయడం చేయాల్సి ఉంటుంది. అలా దాచేయకుంటే భార్య భర్తల మద్య గొడవలు రావడం జరుగుతుంది. భార్య లేదా భర్త ముందు ఇష్టాలను కొన్నింటిని దాచుకోవాలి. లేదంటే కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయంటూ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. శ్రీదేవికి నేను వీరాభిమానిని అనే విషయం నా భార్యకు తెలుసు. ఆ విషయాన్ని ఆమె చాలా సరదాగా తీసుకునేది. ఆ సమయంలో నేను శ్రీదేవి గురించి ఏం మాట్లాడినా కూడా లైట్ గానే రియాక్ట్ అయ్యేది. కాని ఎప్పుడైతే నేను శ్రీదేవితో క్షణం క్షణం చిత్రం చేశానో అప్పటి నుండి నా భార్య మనసులో అనుమానం మొదలైంది.
నాకు శ్రీదేవితో ఏమైనా అఫైర్ ఉండి ఉంటుందా అనే టెన్షన్ ఆమెకు మొదలైంది. అటువంటి సమయంలో శ్రీదేవి రాత్రి 11 గంటల సమయంలో మా ఇంటికి కాల్ చేసింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసి కాస్త సీరియస్ గా మందలించింది. మా ఇద్దరి మద్య అఫైర్ ఉందన్నట్లుగా ఆమె నన్ను మందలించింది. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎవరైనా నాకు శ్రీదేవికి అఫైర్ ఉంది అంటే అదే నిజం అయితే బాగుండు అనుకుంటూ సంతోషంగా ఉంటాను. నా భార్య నన్ను మందలించిన సమయంలో నేను నిజంగా శ్రీదేవితో నాకు సంబంధం ఉంటే నువ్వు ఫిజిల్ గా నన్ను ఆపగలవు. కాని నీలో శ్రీదేవిని ఊహించుకుంటూ నీతో ఉంటే అప్పుడు ఏం చేస్తావంటూ అడిగాను. ఆ ప్రశ్న నా నోట్లోంచి వచ్చిందో లేదో నా చెంప పగులకొట్టింది. భార్య భర్తల మద్య ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. అందుకే పెళ్లితోనే అసలు సమస్యలు మొదలవుతాయని ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.