రామ్ గోపాల్ వర్మ మళ్లీ కొత్త సినిమాతో రెడీ అయిపోయాడు. ఈసారి ఆయన తన సినిమాను రిలీజ్ చేస్తోంది బాలీవుడ్లో కావడం విశేషం. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరప్పన్’ సినిమా మే 27న విడుదల కాబోతోంది. ఇది తెలుగు-కన్నడ భాషల్లో తెరకెక్కిన ‘కిల్లింగ్ వీరప్పన్’కు డబ్బింగ్ వెర్షన్ కాదు.. రీమేక్ అంతకన్నా కాదు. వర్మ మళ్లీ కొత్తగా తీసిన సినిమా ఇదట. ‘కిల్లింగ్ వీరప్పన్’లో కేవలం వీరప్పన్ ను ఎలా చంపారో మాత్రమే చూపించానని.. ఇది వీరప్పన్ పూర్తి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ అని అంటున్నాడు వర్మ.
తెలుగు-కన్నడ భాషల్లో నటించిన సందీప్ భరద్వాజే ఇందులో కూడా వీరప్పన్ పాత్రను పోషించాడు. పోస్టర్ చూస్తే కొత్తగా ఏమీ అనిపించట్లేదు. ‘కిల్లింగ్ వీరప్పన్’ పోస్టర్ లాగే ఉంది. వీరప్పన్ సొంతంగా గడ్డం గీసుకునే దృశ్యంతో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘‘ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి పదేళ్లు పట్టింది.. వీరప్పన్ ను చంపడానికి 20 పట్టింది’’ అంటూ సౌత్ లో తెలుగులో వాడిన క్యాప్షనే దీనికీ ఉపయోగించాడు. ‘నో విలన్ లైక్ హిమ్ ఎవర్ ఎగ్జిస్టెడ్’ అంటూ టైటిల్ కు ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు వర్మ.
మే 27నే ఒకప్పటి తన శిష్యుడు.. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యఫ్ రూపొందించిన ‘రామన్ రాఘవ్’ కూడా రిలీజవుతోందని.. అది కూడా ఓ కిల్లర్ కు సంబంధించిన బయోపిక్ మూవీనే అని కూడా చెప్పాడు వర్మ. ఇద్దరు కిల్లర్లు మే 27న ఒకరినొకరు చంపుకోవడానికి రెడీ అవుతున్నారని.. ఎవరు బెస్ట్ కిల్లరో వాళ్లే గెలుస్తారని అన్నాడు వర్మ.