రానాకి త్రిష ఏమ‌వుతుంది?!

Update: 2016-01-07 19:30 GMT
ల‌వ్‌ బ‌ర్డ్స్‌ గా ఎప్ప‌ట్నుంచో వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు రానా - త్రిష‌. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్య నిజంగా ల‌వ్ ఎఫైర్ న‌డుస్తోందా లేదా అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఎన్ని రూమ‌ర్లొచ్చినా, ఎంతగా ప్ర‌చారం సాగుతున్నా అటు రానా కానీ, ఇటు త్రిష కానీ వాళ్ల మ‌ధ్యనున్న రిలేష‌న్ గురించి ఇప్ప‌టిదాకా  నోరు మెదిపింది లేదు. నిర్మాత వ‌రుణ్ మ‌ణియ‌న్‌ తో త్రిష పెళ్లి జ‌రిగిపోయుంటే మాత్రం రానా - త్రిష‌ల గురించి ఇంత‌గా మాట్లాడుకొనేవాళ్లం కాదు. కానీ ఆ పెళ్లి పీట‌ల‌వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. ఇక అప్ప‌ట్నుంచి మ‌ళ్లీ రానా - త్రిషల గురించి పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల రానా ఎక్క‌డికెళ్లినా త్రిష గురించే అడుగుతున్నార‌ట‌.

ఇటీవ‌ల బెంగుళూరు డేస్ త‌మిళ రీమేక్‌ లో న‌టించాడు రానా. ఆ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్బంగా చెన్నైలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు రానా. అక్క‌డి విలేక‌ర్లు రానాని త్రిషతో బంధం గురించి అడిగార‌ట‌. కానీ రానా మాత్రం దానికి స‌మాధానం చెప్ప‌కుండా ``సినిమాలో స‌మంత‌ - శ్రీదివ్య‌లాంటివాళ్లు న‌టించారు. వాళ్ల గురించి అడిగితే ఏమైనా చెబుతాను కానీ...  సినిమాలో లేని త్రిష గురించి ఎందుకు అడ‌గ‌డం`` అంటూ స‌మాధానాన్ని దాట‌వేశాడ‌ట‌. అయితే అదే సినిమాలోనే రానాతో క‌లిసి న‌టించిన ఆర్య వెంట‌నే జోక్యం చేసుకుని ``నాకైతే త్రిష చెల్లిలాంటిది. మ‌రి రానాకి ఏమ‌వుతుందో తెలియ‌దు`` అన్నాడ‌ట‌. దీంతో అక్క‌డున్న‌వాళ్లంతా న‌వ్వుకొన్నార‌ట‌. అయినా స‌రే... రానా మాత్రం త్రిష గురించి అస‌లేమీ చెప్పలేద‌ట‌. ఇంత‌కీ వీళ్లు ఎప్పుడు మ‌న‌సు విప్పుతారో చూడాలి.
Tags:    

Similar News