బాలీవుడ్ లో లవ్ లు బ్రేకప్ లు సర్వసాధారణం. అదే టాలీవుడ్ లో బ్రేకప్ అయిన నాలుగు సెలబ్రిటీల జంటల పేర్లు చెప్పండి అని అడిగితే మీరు తెల్లమొహం వెయ్యల్సిందే. ఇక బాలీవుడ్ లో బ్రేకప్ అయిన సెలబ్రిటీ జంటల పేర్లు రాయమంటే ఒక ఎ4 సైజ్ పేపర్ నిండా అటూ ఇటూ రాయొచ్చు. ఇక అలా ఘాటుగా లవ్ చేసుకొని ఇక నెక్స్ట్ పెళ్ళే.. అనే సమయంలో బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ అని మూడు సార్లు చెప్పుకున్న మాజీ లవర్స్ జంట దీపిక పదుకొనే - రణబీర్ కపూర్.
బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరూ కలిసి 'ఏ జవానీ హై దీవానీ'.. 'తమాషా' సినిమాలలో నటించారు. విడిపోయినా కలిసి ఫ్రెండ్స్ లా ఉండడం చూసి ఇద్దరూ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య ఒకరి పేరు మరొకరి దగ్గర ప్రస్తావిస్తే చిర్రుబుర్రులాడుతున్నారట. దీపిక ఇప్పుడు రణవీర్ సింగ్ ప్రేమలో ఉంది.. పెళ్ళికి రెడీ అవుతోంది. మరోవైపు రణబీర్ కపూర్ మాత్రం అలియా భట్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుటున్నాడు. పెళ్లి గురించి అడిగితే.. 'ఇంకా టైమ్ ఉంది' అంటున్నాడు.
రీసెంట్ గా రణబీర్ ను 'దీపిక యాక్టింగ్ స్కిల్స్ మీద మీ కామెంట్ ఏంటి?' అడిగితే... "నాకు పెద్దగా నచ్చదు.. ఆమెని చూస్తే కామెడీగా అనిపిస్తుంది" అని సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే గతంలో రణబీర్ గురించి మీ అభిప్రాయం ఏంటని దీపిక ను అడిగితే.. "రణబీర్ ఎవరికీ అర్థం కాడు. ఏ టైం లో ఎలా ఉంటాడో.. ఏం ఆలోచిస్తాడో ఎవరికీ తెలియదు. అతను తన ఫీలింగ్స్ ను బయటపెట్టలేడు. ఇప్పటికైనా అతడు ఆ విషయం నేర్చుకుంటాడని భావిస్తున్నా' అని చెప్పింది.
బాలీవుడ్ ప్లేబాయ్ గా పేరు తెచ్చుకున్న రణబీర్ ని 'అయోమయం' అని పుసుక్కున అనడం విచిత్రమే. నిజంగా అయోమయమా లేదా గర్ల్ ఫ్రెండ్స్ ని మాత్రం అయోమయం లో ఉంచుతాడా? ఇది పక్కన బెడితే రణబీర్ తన ఫీలింగ్స్ ను బయటపెట్టకుండానే బాలీవుడ్ ముద్దుగుమ్మలు అందరూ ఆ అందగాడి చుట్టూ బొంగరం లాగా ఎలా తిరుగుతున్నారు? ఏంటో.. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎక్కువ డౌట్లు వస్తాయి.. మళ్ళీ వాటికి ఎవరు సమాధానం చెప్తారు..?