చేసిందేం లేదు.. అవార్డొస్తే తీసుకుంటా

Update: 2017-07-01 06:04 GMT
ఒక సినిమా నిర్మించాలి అంటే కావలిసింది స్క్రిప్ట్. అవును 100 శాతం అదే, మరి తరువాత అది వెలుగులోకి రావాలంటే కావలిసింది ఉండవలిసింది ఖచ్చితంగా ప్రొడ్యూసరే. మంచి సినిమాలు రావాలి అంటే ఉండవలిసింది మంచి ప్రొడ్యూసర్లే అని చాల మంది చెబుతారు. అదే నిజం కూడాను. అయితే ఇప్పుడు అప్పుడు లాగా ఒక సాంప్రదాయ ప్రొడ్యూసర్లే కాదు కథ నచ్చితే హీరోలు కూడా డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

ప్రతి సినిమాలోను ఏదో ఒక కొత్తదనంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు రణబీర్ కపూర్. మరి ఈ సారి కూడా ఒక మ్యూజికల్ అడ్వేంచర్ ‘జగ్గా జాసూస్’ తో వస్తున్నాడు. ఈ సినిమాకు రణబీర్ కొ- ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు. దానికి కారణం అతనికి కథ నచ్చడమే కాకుండా ఇలాంటి సినిమాలు రణబీర్ చూడాలి అనుకుంటాడట.. అందుకే ప్రొడ్యూస్ చేశా అంటున్నాడు. “జగ్గా జాసూస్ సినిమాకు నేను సహ నిర్మాతగా ఉన్నాను కానీ నేను ఏమి పని చేయలేదు. నాకు నా నటనతోనే సరిపోయింది. అయినా నాకు ప్రొడ్యూసర్ చేసే మేనేజ్మెంట్ పనులు ఏవి సరిగా తెలియవు. అన్నీ అనురాగ్ బసు దాదా చూసుకున్నారు. ఎప్పుడైనా డిస్ని వాళ్ళకి అనురాగ్ కి మధ్య విబేధాలు వస్తే నేను మధ్య ఉండేవాడిని తప్ప అంతకు మించి నేను ప్రొడ్యూసర్ గా పెద్ద  బాధ్యతలు ఏమి తీసుకోలేదు. కాని అవార్డ్ ఏదైనా వస్తే ప్రొడ్యూసర్ గా తీసుకోవడానికి నేను రెడీ'' అంటూ నవ్వించాడు రణబీర్.

కత్రినా కైఫ్ - రణబీర్ కపూర్ విడిపోయాన తరవాత జంట గా నటించి విడుదల అవుతున్న మొదటి సినిమా ఇది. దీనికి అనురాగ్ బసు డైరెక్టర్, ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 14 నాడు జగ్గా జాసూస్ విడుదల అవుతుంది. సినిమాలో  రణబీర్ కపూర్ వాలకం చూస్తే చిన్నప్పుడు చూసిన టింటిన్ యానిమేషన్ సీరియల్ గుర్తుకు వస్తుంది కదా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News