వేసవి సీజన్లో వచ్చిన తొలి భారీ సినిమా ‘రంగస్థలం’ ఫుల్ పాజిటివ్ టాక్ తో మొదలై అదిరిపోయే వసూళ్లు సాధించింది. వీకెండ్ తర్వాత కూడా ఆ చిత్రం నిలకడగా వసూళ్లు సాధించింది. రెండు మూడు వారాల్లోనూ చెప్పుకోదగ్గ వసూళ్లతో సాగింది. ఒక దశలో ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ సాధించడాన్నే గొప్పగా చెప్పుకున్నారంతా. కానీ ఇప్పుడా చిత్రం వరల్డ్ వైడ్ రూ.120 కోట్ల షేర్ మార్కుకు చాలా చేరువగా ఉండటం విశేషం. నాలుగు వారాల తర్వాత ‘రంగస్థలం’ రూ.118.34 కోట్ల షేర్ సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాల వరకే షేర్ రూ.86 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. రూ.105 కోట్ల షేర్ తో ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును ఈ చిత్రం రెండు వారాల్లోనే అధిగమించిన సంగతి తెలిసిందే.
ఏరియాల వారీగా నాలుగు వారాల్లో ‘రంగస్థలం’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..
నైజాం- రూ.25.8 కోట్లు
వైజాగ్- రూ.30 కోట్లు
తూర్పు గోదావరి- రూ.8.01 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.5.78 కోట్లు
కృష్ణా- రూ.6.62 కోట్లు
గుంటూరు- రూ.7.95 కోట్లు
నెల్లూరు- రూ. 3.18 కోట్లు
సీడెడ్- రూ.16.45 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.86.04 కోట్లు
కర్ణాటక- రూ.8.75 కోట్లు
యుఎస్- రూ.18.5 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ. 5.05 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ118.34 కోట్లు
ఏరియాల వారీగా నాలుగు వారాల్లో ‘రంగస్థలం’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..
నైజాం- రూ.25.8 కోట్లు
వైజాగ్- రూ.30 కోట్లు
తూర్పు గోదావరి- రూ.8.01 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.5.78 కోట్లు
కృష్ణా- రూ.6.62 కోట్లు
గుంటూరు- రూ.7.95 కోట్లు
నెల్లూరు- రూ. 3.18 కోట్లు
సీడెడ్- రూ.16.45 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.86.04 కోట్లు
కర్ణాటక- రూ.8.75 కోట్లు
యుఎస్- రూ.18.5 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ. 5.05 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ118.34 కోట్లు