రామ్ చరణ్ మూవీ రంగస్థలం రిలీజ్ అయ్యి ఇప్పటికి నెల రోజులు గడిచింది. అంటే.. ఈ సినిమా ముచ్చటగా ఐదో వీకెండ్ ను కూడా పూర్తి చేసుకుందన్న మాట. ఇంత రన్ సాధించినా సరే.. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే.. దాదాపు అన్ని ఏరియాల నుంచి చెప్పుకోదగ్గ షేర్ లభిస్తోందంటే.. రంగస్థలం హంగామా ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
అసలు రెండో వీకెండ్ తర్వాత సినిమా నిలబడ్డమే కష్టం అయిపోయిన పరిస్థితుల్లో.. నెల రోజుల తర్వాత కన్సిస్టెంట్ గా కలెక్షన్స్ కుమ్మేయడం రంగస్థలంకు మాత్రమే చెల్లింది. కానీ ఈ చిత్రానికి ఓ 10 రోజులుగా అస్సలు ప్రమోట్ చేయడం లేదు. నిలకడగా వసూళ్లు సాధించే చిత్రానికి.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ మరింత సపోర్ట్ ఇస్తాయనడంలో సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు చేస్తోంది కూడా. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తో కూడా ప్రెస్ మీట్ పెట్టించడం.. విడుదల అయిన వారం రోజుల తర్వాత విజయవాడ సహా పలు ఊళ్లు తిరుగుతూ.. థియేటర్లలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడ్డం చేస్తున్నాడు.
కానీ రంగస్థలం విషయంలో ఏం చేయకపోయిన డబ్బులు భారీగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 118 కోట్ల షేర్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం.. 200 కోట్ల గ్రాస్ సాధించడం ఖాయం అని ట్రేడ్ అంచనా వేస్తోంది. రంగస్థలంకు కూడా భరత్ అనే నేను మాదిరిగా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో కాస్త అలర్ట్ గా ఉంటే.. రంగస్థలం ఫైనల్ రన్ మరింత ఎక్కువగా ఉండేదని అంటున్నారు. అయితే.. భరత్ అనే నేను మూవీని నిర్మించిన నిర్మాతలే.. తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. వారంతా ఒక మాట అనుకునే.. ఇలా రంగస్థలం ప్రమోషన్స్ ఆపేశారనే టాక్ ఉంది. వాళ్ల సంగతేమో కానీ.. థియేటర్లలో రెండు సినిమాలు ఇరగదీసేసి ఆడేస్తుంటే మాత్రం.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది.