టాలీవుడ్ బాగా డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో రాశి ఖన్నా పేరు తప్పకుండా వినిపిస్తుంది. తను చేసే పాత్ర డిమాండ్ మేరకు నటించేందుకు వీలుగా మౌల్డ్ అయిపోతుండడం ఈ భామ స్పెషాలిటీ. అందుకే యంగ్ హీరోలందరూ ఈమెనే కావాలని కోరుకుంటున్నారు. ఇంకా స్టార్ స్టేటస్ అందుకోకపోయినా.. ఆ రేంజ్ కి దగ్గరగా ఉన్న రాశి ఖన్నా.. తనకు ఇంకా సిగ్గు తగ్గలేదని చెబుతోంది.
'నేను సినిమా ఫీల్డ్ కి వచ్చి ఏళ్లు గచిపోయినా నాలో ఉన్న సిగ్గు మాత్రం ఇంకా పోలేదు. స్క్రీన్ పై కొన్ని రోల్స్ చూస్తున్నపుడు ఇలాంటివి నేను చేయగలనా అనిపిస్తుంది. కానీ డైరెక్టర్లు నా రోల్ గురించి వినిపిస్తున్నపుడు.. నేను చేయగలననే నమ్మకంతోనే కదా చెబుతున్నారు అనిపిస్తుంది. అందుకే నాకు సిగ్గుగా అనిపించినా.. ఆ రోల్ పై నాకు డౌట్స్ ఉన్నా.. దర్శకులు ఇచ్చిన ధైర్యంతో పూర్తి చేసేస్తుంటా' అని చెప్పింది రాశి ఖన్నా.
ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి హైపర్ లోను.. గోపీచంద్ సరసన ఆక్సిజన్ లో రాశి నటించగా.. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఇండస్ట్రీలో అనుకున్నవి అనుకున్నట్లుగా ఏం జరగవని.. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కొంచెం వేదాంతం కూడా వల్లించేస్తోందీ భామ.