వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్..

Update: 2020-05-01 00:30 GMT
టాలీవుడ్ లో హీరోయిన్లతో పాటు అదే రేంజ్ లో పేరు సంపాదించుకుంటున్న టీవీ యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ గౌతమ్ మాత్రమే. బుల్లితెర పై తన గ్లామర్ గుప్పిస్తూ విపరీమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. బుల్లితెర నుండి వెండితెరకు పరిచయమైన రష్మీ తన అందాల ఆరబోతకు మాత్రం ఎల్లప్పుడూ రెడీనే అంటుంది. అయితే ఎన్ని సినిమాలు, షోలు చేసినా రష్మీకి గుర్తింపు తెచ్చింది మాత్రం జబర్దస్త్ కామెడీ షోనే. ప్రస్తుతం అమ్మడు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతుంటుంది. తాజాగా ఏప్రిల్ 27న రష్మీ లాక్ డౌన్లో ఉండి పుట్టినరోజు జరుపుకుంది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీపై అమితమైన ఇష్టంతో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది రష్మీ. రాగానే రెండు, మూడు సినిమాల్లో నటించింది. సినిమాల్లో అదృష్టం లేక.. లాభం లేదనుకుని సీరియల్స్‌లో నటించింది.

అక్కడ కూడా అదృష్టం లేక ఒక్కసారిగా జబర్దస్త్ షోలో అవకాశం రష్మీ కెరీర్‌ ను మలుపుతిప్పింది. యాంకర్‌గా తనకు వచ్చిరానీ తెలుగును వెరైటీగా పలికేస్తూ కొనసాగింది. ఈ టైమ్‌లో సుధీర్ - రష్మీ మధ్య మాంచి కెమిస్ట్రీ ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇంకేముంది అమ్మడు పాజిటీవ్ కంటే నెగెటీవ్ టాక్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది. ఫామ్ లో ఉండగానే గుంటూరు టాకీస్‌ సినిమాలో తన అందాలన్నీ ఆరబోసి అందరిచూపు తనవైపు తిప్పుకుంది. అప్పటి నుండి యాంకర్ కం యాక్ట్రెస్ గా రాణిస్తోంది. లాక్ డౌన్‌ లో వచ్చిన తన పుట్టినరోజును ఖుషీగా జరుపుకుని.. తన ఫ్రెండ్స్‌తో కలసి కుక్కలకు ఆహారం అందించింది. ‘హాయ్.. ఇట్స్ మై బర్త్ డే. నా డాగీ ఫ్రెండ్స్.’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సహజంగా రష్మీకి కుక్కలంటే అమితమైన ప్రేమ. కుక్కలను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోదు కూడా. ఇలా తన బర్త్డే రోజు మూగజీవాలకు ఆహారం అందించి వార్తల్లో నిలిచింది.
Full View
Tags:    

Similar News