పిక్ టాక్ : ఇలా చూపులతో చంపేయడం భావ్యం కాదు శ్రీవల్లి

Update: 2022-12-19 10:30 GMT
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా పాన్ ఇండియా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా చేసిన హిందీ సినిమాలు నిరాశ పర్చినా కూడా ఇంకా తన అందంతో అక్కడ ఆఫర్లను దక్కించుకుంటూనే ఉంది. ప్రస్తుతం సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో రష్మిక మందన్నా నిలిచింది.

ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో సోషల్‌ మీడియాలో తానే ముందు అన్నట్లుగా ఉంటుంది. అందరితో పాటు తాను అన్నట్లుగా కాకుండా తన ఫొటోలు చాలా ప్రత్యేకంగా ఉండేలా ఈ అమ్మడు కెమెరా ముందు కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల విందు ఆకట్టుకుంది. ఈసారి స్కిన్‌ షో చేయకుండా ఓర కంట చూస్తూ చూపులతో చంపేస్తాను అన్నట్లుగా కవ్విస్తూ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. శ్రీవల్లి యొక్క అందాల ఆరబోత ఫొటోలు మాత్రమే కాకుండా ఇలా కవ్వించే చూపులతో కూడా రష్మిక ఆకట్టుకుంటూ ఉంది.

తెలుగు లో ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్‌ కు జోడీగా పుష్ప 2 లో నటిస్తుంది. అది కాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. హిందీలో రూపొందుతున్న యానిమల్‌ సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క స్పీడ్‌ ఈ  మధ్య కాస్త తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పుష్ప 2 సినిమా విడుదల తర్వాత కచ్చితంగా మళ్లీ ఈ అమ్మడు మునుపటి మాదిరిగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందాల కవ్వింపు ఫొటో షూట్స్ ను షేర్ చేస్తే ఫిల్మ్‌ మేకర్స్ తమ సినిమాల్లో ఎంపిక చేసుకోకుండా ఉంటారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News