చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన దూకుడు పెంచారు. వరుసగా కథలు వింటూ .. వాటిని ఓకే చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నవి కావడం విశేషం. ఇటీవలే ఆయన కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా షూటింగును పూర్తిచేశారు. సందేశంతో కూడిన ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన జంటగా చరణ్ - పూజ హెగ్డే కనువిందు చేయనున్నారు.
ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలవుతూ ఉండగానే, చిరంజీవి తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లారు. చిరంజీవి తన తదుపరి సినిమాగా 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు. కొంతకాలం క్రితం మలయాళంలో విజయాన్ని సాధించిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. కుటిల రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేసి, ఆ మార్పుల పట్ల చిరంజీవి సంతృప్తిని వ్యక్తం చేసిన తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
మలయాళంలో మంజువారియర్ చేసిన పాత్ర ద్వారా సీనియర్ హీరోయిన్ శోభన రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆమె చిరంజీవి జోడీగా 'రౌడీ అల్లుడు' .. 'రుద్రవీణ' సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలకి కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానం దక్కింది. మళ్లీ ఇంతకాలానికి ఆమె చిరూ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక ఆ తరువాత సినిమాను చిరంజీవి .. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని జాలరుల జీవితాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. వైజాగ్ లో తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రవితేజను సంప్రదిస్తున్నారట. ఈ పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడని భావించి ఆయనను అడుగుతున్నారని అంటున్నారు.
గతంలో 'అన్నయ్య' .. 'శంకర్ దాదా జిందాబాద్' వంటి చిరూ సినిమాల్లో రవితేజ సందడి చేశాడు. మరి ఇప్పుడు ఈ సినిమాలో చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆల్రెడీ పూర్తయిన 'ఆచార్య'ను కలుపుకుంటే, వచ్చే ఏడాది చిరంజీవి మూడు భారీ సినిమాలతో బాక్సాఫీస్ బద్ధకం వదిల్చడం ఖాయమనే విషయం అర్థమవుతోంది.