తెలుగు సినిమాలేవీ పోటీలో లేని టైం చూసి.. తన సినిమాను రిలీజ్ చేసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు తమిళ కథానాయకుడు విశాల్. అతడి కొత్త సినిమా ‘రాయుడు’కు డివైడ్ టాకే వచ్చినా.. ఊర మాస్ సినిమా అని ముద్ర పడినా.. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.3 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. శని.. ఆది వారాల్లో సైతం సినిమాకు మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ మధ్య తెలుగులో మాస్ సినిమాలు బాగా తగ్గిపోయాయి. అందులోనూ విలేజ్ స్టోరీలు అరుదైపోయాయి. ఇలాంటి టైంలో విశాల్ సినిమా ఊర మాస్ గా ఉండటంతో ఆ వర్గం ప్రేక్షకుల్ని బాగానే మెప్పిస్తోంది. బి.. సి సెంటర్లలో ఈ సినిమాకు అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. గత వారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ పూర్తిగా డల్ అయిపోగా.. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘రాయుడు’ అయింది. టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ వరకు ఢోకా లేకపోయింది.
కెరీర్ ఆరంభంలో తెలుగులోనూ వరుస విజయాలందుకుని తనకంటూ మార్కెట్ సంపాదించుకున్న విశాల్.. ఆ తర్వాత బాగా వెనకబడిపోయాడు. గత రెండు మూడేళ్లలో కొన్ని మంచి సినిమాలతో పలకరించినా అవి సరైన టైమింగ్ లో రిలీజ్ కాకపోవడం.. పబ్లిసిటీ కూడా సరిగా చేయకపోవడం వల్ల ఆడలేదు. ఐతే ‘రాయుడు’ సమ్మర్ సీజన్లో పోటీ లేకుండా రిలీజై మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. విశాల్ కు తెలుగులో ఇదే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.