పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు సినిమాలు వస్తున్నాయంటే దానికి ముందో వారం.. తర్వాత ఓ వారం ఇంకే సినిమా రిలీజ్ చెయ్యాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఐతే గత నెల 'సర్దార్ గబ్బర్ సింగ్' తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకోవడం ఆలస్యం తర్వాతి వారానికి రెండు సినిమాలు బెర్తులు బుక్ చేసేసుకున్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ తెలుగు మూవీ (ఈడోరకం ఆడోరకం) అయితే.. ఇంకోటి తమిళ డబ్బింగ్ సినిమా (పోలీస్). ఇప్పుడు మహేష్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో తర్వాతి శుక్రవారానికి రెండు సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.
ఆల్రెడీ సందీప్ కిషన్ సినిమా 'ఒక్క అమ్మాయి తప్ప' 27వ తేదీకి షెడ్యూల్ అయి ఉంది. బ్రహ్మోత్సవం హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే దాన్ని వాయిదా వేసేవాళ్లేమో. కానీ టాక్ వీక్ గా ఉండటంతో 27కు రిలీజ్ డేట్ లాక్ చేసేశారు. ఇక విశాల్ సినిమా 'రాయుడు' నిర్మాత 27న రిలీజ్ అంటూ డేరింగ్ గా ప్రెస్ నోట్ ఇచ్చేశాడు. నిజానికి ఈ సినిమా ఈ శుక్రవారమే తమిళ-తెలుగు భాషల్లో విడుదల కావాల్సింది. కానీ 'బ్రహ్మోత్సవం' రేసులోకి రావడంతో తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ వాయిదా వేశారు. ఇప్పుడిక 'బ్రహ్మోత్సవం' టాక్ తేలిపోగానే ధైర్యంగా 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమా హిట్ టాక్ తో నడుస్తోంది.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన శ్రీదివ్య కథానాయికగా నటించింది.