హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ జెనీలియా. ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. 2012లో ఈమె రానాతో కలిసి నటించిన ‘నా ఇష్టం’ చిత్రం చివరిది. అప్పటి నుండి కూడా జెనిలియా మళ్లీ సినిమాల్లో నటిస్తుందని ఎవరు అనుకోలేదు. అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి పిల్లలు పెద్ద వారు అవ్వడంతో మళ్లీ జెనిలియా సినిమాల వైపు అడుగులు వేస్తుంది.
గత ఏడాది కాలంగా సినిమా పరిశ్రమకు జెనిలియా దగ్గరగా ఉంటూ వస్తుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు ఈమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఛాన్స్ దక్కినట్లుగా తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ మూవీలో జెనీలియాకు ఛాన్స్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చేయబోతున్న సినిమా లూసీఫర్ అని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆ రీమేక్ కు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు.
రీమేక్ స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశకు వచ్చిందని.. ఒక కీలక పాత్రకు గాను జెనీలియాను ఈ చిత్రంలో నటింపజేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చినట్లుగా మెగా కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. జెనీలియాకు నిజంగానే మెగా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆమెకు మంచి రీ ఎంట్రీ లభిస్తుందని ఆమె అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం అయ్యి అదే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేసేలా సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట.