మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో సంక్రాంతి పండుగకు ప్రత్యక్షంగా చూశాం. టాలీవుడ్ సినిమాకు వంద కోట్ల మార్క్ అందుకునే సత్తా(బాహుబలి లాంటి సుదీర్ఘమైన ప్రాజెక్ట్ కాకుండా) ఉందని నిరూపించారు చిరు. అలాగే పదేళ్ల తర్వాత వచ్చినా ఇండస్ట్రీలో తన స్థాయిని రీప్లేస్ చేసే రేంజ్ ను మరెవరూ అందుకోలేదని కూడా చెప్పకనే చెప్పేశారు.
ఇప్పుడు మెగా 151పై బోలెడంత ఆసక్తి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని సినిమాగా మలుస్తున్నారనే న్యూస్ ఉంది. ఇప్పుడీ విషయాన్ని చిరంజీవి కన్ఫాం చేశారు. అసలు ఆ కథనే ఎంచుకోవడానికి కారణాలు కూడా చెప్పారు. 'మన దేశంలో మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు. 1857లో సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిషర్లతో పోరాటం సాగించాడు. బ్రిటిష్ వాళ్ల గెజిట్లలో ఉయ్యాలవాడ గురించి ఉంటుంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు అందరూ ఆయన గురించి ప్రస్తావించారు' అన్నారు చిరు.
'గతంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనుకునేవారు. కానీ ఇప్పుడిలాటి సినిమాలను చూస్తామని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. ఆ అంశాన్ని ఉయ్యాలవాడ మరోసారి రుజువు చేయడం ఖాయం' అన్న చిరంజీవి.. దీనికి మూలకథ పరుచూరి బ్రదర్స్ అందించగా.. బోలెడంత రీసెర్చ్ చేసి సురేందర్ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉయ్యాలవాడ స్క్రిప్ట్ పై పరచూరి బ్రదర్స్.. సత్యానంద్.. భూపతి రాజా.. కణ్ణన లాంటి రచయితలు వర్క్ చేస్తుండగా.. బుర్రా సాయిమాధవ్.. వేమారెడ్డిలు డైలాగ్స్ రాస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ మూవీలో తన స్టైల్ పంచ్ డైలాగ్స్ కూడా పేల్చనున్నట్లు తెలిపారు చిరంజీవి.
ఓ దేశభక్తుడికి చెందిన జీవితం కావడంతోనే ఈ చిత్రానికి దేశమంతటా ఆదరణ ఉంటుందని నమ్ముతున్నామని.. అందుకే తెలుగుతో పాటు.. తమిళ్..హిందీల్లో కూడా విడుదల చేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/