సుజాత ఎలిమినేషన్‌ కు 'బిట్టు' కారణం కానేకాదట

Update: 2020-10-15 07:45 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ అయిదవ వారం తర్వాత జోర్దార్‌ సుజాత ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఆమె ఎలిమినేట్‌ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె ఫేక్‌ నవ్వు మరియు ఆమె నాగార్జునను బిట్టు అంటూ పిలవడం అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగుతోంది. నాగార్జునను బిట్టు అంటూ పిలవడం షో నిర్వాహకులకు ఇష్టం లేదని అందుకే ఆమెను ఎలిమినేట్‌ చేశారు అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు. కాని ఆ విషయమై సుజాత క్లారిటీ ఇచ్చింది. అసలు షో నిర్వాహకులు స్వయంగా తనకు నాగార్జున గారిని బిట్టు అంటూ పిలవమన్నారని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

నాగార్జున గారు నటించిన మనం సినిమాలో బిట్టు పాత్రలో నాకు బాగా నచ్చుతాడు అంటూ బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు ఇంటర్వ్యూ సమయంలో చెప్పాను. అప్పుడే వారు నీకు ఇష్టం అనిపిస్తే బిట్టు అంటూ ఆయన్ను పిలవచ్చు అన్నారు. వారి అనుమతి మరియు నాగార్జున గారి సమ్మతితోనే బిట్టు అంటూ నేను పిలిచాను తప్ప నా సొంతంగా నేను ఏమీ పిలవలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఒక వేళ ఆ పదం నాగార్జున కు కాని నిర్వాహకులకు కాని ఇబ్బంది అనిపిస్తే ముందుగానే సుజాతకు కన్ఫెక్షన్‌ రూంకు పిలిపించి విషయం చెప్పే వారు. కాని అలా ఏమీ జరగలేదు. కనుక బిట్టు అంటూ పిలవడం వల్ల సుజాత ఎలిమినేట్‌ అయ్యింది అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు.

సుజాత నవ్వు విషయంలోనే చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆమె నిజంగా అలాగే నవ్వుతుందో లేక షో లో నవ్విందో తెలియదు కాని ఆమె నవ్వును చాలా మంది ఫేక్‌ అనుకున్నారు.. కొందరు అర్థరహితమైన పిచ్చి నవ్వు అనుకున్నారు. అందుకే ఆమెను ఎలిమినేట్‌ చేయాలని భావించి ఓట్లు వేయలేదు. పైగా గత వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారిలో ఆమె మాత్రమే వీక్‌ కంటెస్టెంట్‌. ఆ కారణం వల్ల పూర్తిగా ప్రేక్షకుల ఓట్ల వల్లే ఆమె ఎలిమినేట్‌ అయ్యింది తప్ప బిగ్‌ బాస్ నిర్వాహకులు ఏదో కారణం వల్ల ఆమెను ఎలిమినేట్‌ చేయలేదు అనిపిస్తుంది.
Tags:    

Similar News