తారకరత్నని రెజీనా 'అన్న' అంటోంది

Update: 2016-04-29 04:30 GMT
రెజీనా కసాండ్రా ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లలో మహా ట్యాలెంటెడ్. గతంలో పెర్ఫామెన్స్ రోల్స్ కి మాత్రమే పనికొస్తుంది అన్నారు కానీ.. ఇప్పుడు గ్లామర్ కేరక్టర్స్ కూడా ఇరగదీసేస్తోంది. ఈమె సడెన్ గా ఓ హీరో కం విలన్ పాత్రధారిని ఇంటర్వ్యూ చేస్తూ.. కొత్త రోల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జ్యో అచ్యుతానందలో తనతో కలిసి నటిస్తున్న రెజీనాను.. రాజా చెయ్యి వేస్తే చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నాడు నారా రోహిత్. అది కూడా డిఫరెంట్ ఆలోచనతో.. రెజీనాతో యాంకరింగ్ చేయించాడు. రాజా చెయ్యి వేస్తే మూవీలో విలన్ గా నటించిన తారకరత్నను.. రెజీనా ఇంటర్వ్యూ చేసింది. 9 ఏళ్ల వయసులోనే టీవీల్లో యాంకరింగ్ చేసిన అనుభవం ఈ భామకు ఉంది. ఆ తర్వాత 16ఏళ్లకే కమర్షియల్స్ మెరిసిపోయింది. అందుకే చాలా ఈజీగా ఇంటర్వ్యూని హ్యాండిల్ చేసేసింది.

సినిమా గురించి - డైలాగ్స్ గురించి - సాంగ్స్ గురించి - కేరక్టర్స్ గురించి.. ఇలా బోలెడన్ని ప్రశ్నలు తారకరత్నను అడిగింది. ఈ నందమూరి హీరో కూడా ఎంతో ఓపిగ్గా, వివరంగా ఆన్సర్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే.. ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే తారకరత్న అన్న మనతో ఉన్నారు అన్న రెజీనా.. చివర్లో తారక్ అన్నా అంటూ పర్సనల్ గా మాట్లాడేసింది. ఇండస్ట్రీలో ఇలా ఓ హీరోయిన్.. ఓ హీరోని అన్నా అని ఆన్ స్క్రీన్ పై పిలవడం మాత్రం కొత్తగానే అనిపించింది.
Full View

Tags:    

Similar News