బిగ్ బాస్ 6 : షో రేటింగ్ కి అతనొక్కడే హోప్..

Update: 2022-11-12 08:30 GMT
11 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 షో రేటింగ్ అంతంత మాత్రంగానే ఉండగా బిగ్ బాస్ ఆడియన్స్ ని మరింత అలరించాలని టీం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే రకరకాల టాస్కులతో సైలెంట్ గా ఉన్న హౌస్ ని గందరగోళంగా మార్చాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ టైటిల్ రేసులో ఉన్న రేవంత్ మీదే బిగ్ బాస్ టీం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆటలో రేవంత్ దూసుకెళ్తున్న విధానం.. అవతల వాళ్లు తనని ఏమైనా అంటే నోరు జారే తీరు బిగ్ బాస్ టీం కి బాగా హెల్ప్ అయ్యింది.

అందుకే రేవంత్ మీద దృష్టి పెట్టి అతనికి వ్యతిరేకంగా ఉన్న వారిని అవతల టీం లో పెడుతున్నారు. లేటెస్ట్ గా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా రేవంత్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించడంతో తన ఫ్రెండ్ అయిన శ్రీ సత్య కూడా అతని మీద సీరియస్ అయ్యింది.

అప్పటినుంచి రేవంత్ చాలా సైలెంట్ అయ్యాడు. టాస్కుల్లో రేవంత్ టెంప్ట్ అవుతున్న విధానాన్ని చూసే బిగ్ బాస్ టీం అతని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అతన్నే సంచాలక్ గా చెప్పడం లాంటివి ఇందులో భాగమని చెప్పొచ్చు. తను ఎవరికి ఏమైనా చెప్పొచ్చు.. కానీ తనకు మాత్రం ఎవరు ఏమి చెప్పకూడదు.

తను చేసిందే కరెక్ట్ అని కొన్ని సందర్భాల్లో వాదిస్తాడు రేవంత్. ఈ వీక్ తన ఫ్రెండ్ అయిన శ్రీహాన్ తో కూడా రేవంత్ దూరంగా ఉంటున్నాడు. అతను శ్రీసత్య కి దగ్గరై రేవంత్ కి దూరమవుతున్నాడని ఫీల్ అవుతున్నాడు.

షో రేటింగ్ పెంచేందుకు రేవంత్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు బిగ్ బాస్ టీం. అయితే అతని నెగటివ్స్ ని ఎక్కువగా చూపిస్తే ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్నది అతనే కాబట్టి మళ్లీ అక్కడ దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే బ్యాలెన్స్ చేస్తూ బిగ్ బాస్ టీం వ్యవహరిస్తుంది. రేవంత్ ఆట తీరు.. తన ఎరోగెంట్ నెస్ వల్లే ఈ సీజన్ కాస్త కూస్తో ఆసక్తిగా మారింది. అంతేకాదు ఈ ప్రవర్తన వల్ల ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్నాడు.

తను కెప్టెన్ గా ఉన్న వారం తప్ప రేవంత్ జరిగిన 10 వారాలు నామినేషన్స్ లో ఉన్నాడు. అందుకే ఓటింగ్ లో కూడా అతనికే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6లో టాప్ 5 కి ఎవరు వెళ్తారు..? టైటిల్ రేసులో రేవంత్ ఒక్కడేనా మరెవరికైనా ఛాన్స్ ఉందా..? మీ దృష్టిలో టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అన్నది కింద కామెంట్ చేయండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News