మళ్లీ కొంపముంచేలా ఉన్నాడే..

Update: 2018-05-22 17:30 GMT
బాలీవుడ్ లో అతిపెద్ద సినిమా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కపూర్ ఫ్యామిలీ ముందున్నారని చెప్పాలి. చాలా వరకు ఆ ఫ్యామిలీ నుంచి ఒక తరం అయిపోగానే మరో తరం వారు పరిచయం అవుతూనే ఉంటారు. అయితే ఆ ఫ్యామిలిలో పెద్ద మనిషిగా చెప్పుకునే రిషి కపూర్ మాత్రం ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటారు. ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అలాగే అభిమానులు దగ్గరికి వస్తే కొట్టేస్తాడు. లేదంటే అరవడం కామన్.

ఆయన వల్ల కపూర్ ఫ్యామిలీ తలదించుకోవాల్సి వస్తోంది. మొన్నే సోనమ్ కపూర్ ఇచ్చిన పార్టీలో సల్మాన్ మరదలితో మిస్ బిహేవ్ చేశాడని ఒక న్యూస్ వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇక ఆ విషయం పక్కన పెడితే రీసెంట్ గా భట్ ఫ్యామిలీ గురించి ఒక పాజిటివ్ ట్వీట్ చేశాడు. ఆ ఫ్యామిలిలో దాదాపు అందరితో నటించాను అని వారి పేర్లు తలచుకున్నాడు. మహేష్ భట్ నుంచి అలియా భట్ వరకు అందరికి థ్యాంక్స్ చెప్పాడు.

ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ మధ్య రన్బీర్ కపూర్ ఆలియా భట్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు టాక్ వస్తోంది. అంతే కాకుండా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ విషయం గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకోవడం వైరల్ అవుతోంది. రన్బీర్ కపూర్ మళ్లీ కపూర్ ఫ్యామిలీకి ఎదో పెద్ద తలనొప్పి తెచ్చు కొంపముంచేలా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
Tags:    

Similar News