ఈయన భలే మనిషండీ బాబూ!!

Update: 2017-08-18 21:30 GMT
చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్లో ఉంటారు. చాలామందికి మిలియన్లలో ఫాలోవర్లు ఉంటారు. కాకపోతే పెద్ద పెద్ద స్టార్లు మాత్రం తమ సినిమా అప్డేట్లు.. లేదంటే ఏదన్నా శుభాకాంక్షలు చెప్పడం తప్పిస్తే ట్విట్టర్ ను దేనికీ వాడరు. కాని ఒక పెద్ద మనిషి మాత్రం.. తన టైమ్ లైన్ ను చాలా ఎక్సయిటింగ్ గా చేస్తారు. అదెవరో కాదు.. సీనియర్ హీరో.. ఒకప్పటి లవర్ బాయ్ రిషి కపూర్. ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిందే.

మొన్నటికి మొన్న పాకిస్తాన్ కు విషెస్ చెప్పేసి పెద్ద రచ్చే లేపాడు. వారికి ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడులే. ఆ తరువాత మనోడు సర్ గంగా రామ్ అనే ఇంజనీర్ జీవితచరిత్రను తనను పెట్టి తీయాల్సిందిగా కోరాడు. ఇప్పటి పాకిస్తాన్ లో మన దేశం విడిపోక ముందు జరిగన కతను తీయమని చెప్పడం.. అందులో ఆయన్ను పెట్టుకోమనడం.. మరి ఆశ్చర్యకరమే. అలాగే రోమ్ లో తిరుగుతున్న వీడియోలు పోస్టు చేయడం.. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఇన్ కమ్ ట్యాక్స్ అనే సినిమాకు సీక్వెల్ కాదు అంటూ జోకులు పేల్చడం.. కొడుకు సినిమా జగ్గా జసూస్ బడ్జెట్ లో తీయలేకపోయారు అంటూ కామెంట్ చేయడం.. ఇవన్నీ ఆయనకే చెల్లాయ్. అందుకే అనేది ఆయన భలే మనిషండీ బాబూ అని.

అయితే తెలుగులో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విట్టర్ ఎకౌంట్ ఎవరిదన్నా ఉందా అని చూస్తే.. అసలు సీనియర్ స్టార్లలో రిటైర్డ్ అయినవారు సోషల్ మీడియాలో లేరు.. చాలామంది సీనియర్ స్టార్లు ఇంకా రిటైర్డ్ కాలేదు. అది సంగతి.
Tags:    

Similar News