క్లిక్‌ క్లిక్‌ : తెలుగమ్మాయి దసరా లుక్‌ అదుర్స్‌

Update: 2020-10-27 02:30 GMT
చూడ్డానికి ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండే రీతూ వర్మ తెలుగులో కొన్ని సినిమాలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం కోలీవుడ్‌ మరియు మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. పెద్ద హీరోలకు వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిపోయిన రీతూ వర్మ మెల్ల గా మళ్లీ తెలుగులో కూడా నటించేందుకు సిద్దం అవుతోంది. సాదారణంగా అయితే తెలుగు అమ్మాయిలను టాలీవుడ్‌ ఎక్కువగా పట్టించుకోదు. కాని రీతూ వర్మ విషయంలో మాత్రం కొంత సడలింపు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

తెలుగులో ఈమె ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తుంది. తాజాగా రవితేజ మరియు రమేష్‌ వర్మల కాంబోలో ప్రకటించిన మూవీలో కూడా ఈమె హీరోయిన్‌ గా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రీతూ వర్మ మరో వైపు సోషల్‌ మీడియాలో కూడా హాట్‌ ఫొటో షూట్స్‌ తో పాటు ఒక మంచి సాంప్రదాయబద్దమైన అమ్మాయిగా కూడా కనిపిస్తూ ఉంటుంది.

దసరా శుభాకాంక్షలు చెప్పేందుకు గాను ఈ ఫొటోలను రీతూ షేర్‌ చేసింది. ఈ చీర కట్టులో రీతూ వర్మ కు చక్కనైనా తెలుగు అమ్మాయిగా ఉన్నావంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ ఇస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని మన ఫిల్మ్‌ మేకర్స్‌ ఇంకా ఎక్కువ చూడాలని మంచి ఆఫర్లు ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News