చెప్పేది నిజమైతే ఎందుకు చెక్కేశావ్??

Update: 2017-04-05 10:42 GMT
సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా సక్సెస్ మీట్స్ పెట్టడం అనే ట్రెండ్ చాలా కాలం నుంచి ఉంది. అయితే.. ఇది కేవలం చోటా మోటా సినిమాలు.. చిన్నా చితకా డైరెక్టర్లు.. బుల్లి బుచికీ హీరోల సినిమాలకు మాత్రమే పరిమితం.  ఓ రేంజ్ సినిమాల వరకూ ఫ్లాప్ సినిమాల వరకూ సక్సెస్ టూర్స్ చేసే ట్రెండ్ నడుస్తుంటుంది.

కానీ స్టార్స్ విషయానికొస్తే..  స్టార్ హీరో అయినా.. డైరెక్టర్ అయినా సరే.. ఎవరూ కూడా తమ సినిమా ఫ్లాప్ అయితే.. మళ్లీ దాని గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఖాయం చేసుకున్నాక అప్పుడు జనాల ముందుకొచ్చి.. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతామంటారు. కానీ పూరీ జగన్నాధ్ తన లేటెస్ట్ మూవీ రోగ్ విషయానికి వచ్చేసరికి సక్సెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ ను పిలిచీ హీరో.. హీరోయిన్ తో కలిసి.. సినిమాని సూపర్ హిట్ చేసేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు థ్యాంక్స్ కూడా చెప్పేశారు.

మొత్తం టీం అంతా రోగ్ మూవీ హిట్ అంటుంటే.. ఇంత కామెడీ చేస్తున్నారేంటా అని మీడియాకి డౌట్ వచ్చేసింది. సర్లే.. వాళ్లు మాట్లాడ్డం అయ్యాక అడగచ్చులే అని మీడియా అనుకుంటే.. వాళ్లు చెప్పాల్సింది చెప్పి తుర్రుమనేశారు పూరీ టీం. నిజంగా తాము చెబుతున్నది నిజమే అని నమ్మితే.. మీడియాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చెక్కేయడం ఎందుకో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News