దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి # RRR క్లైమాక్స్ ని నభూతోనభవిష్యతి అన్న తీరుగా తెరకెక్కించేందుకు హైదరాబాద్ నగరంలో భారీగా బలగాల్ని దించేయడం పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఎన్.టి.ఆర్- రామ్ చరణ్ ఇద్దరూ తాజా షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. RRR క్లైమాక్స్ ఫైట్ ని సాహస విన్యాసాలను చిత్రీకరించడానికి టీమ్ RRR ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ను రంగంలోకి దించింది. ఇప్పుడు నిక్ పావెల్ కీలక షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఇక పతాక సన్నివేశాల్లో భీకర పోరాటాల కోసం RRR బృందం అమెరికా నుండి 40 మంది యోధులను బరిలో దించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ యోధులు హైదరాబాద్ లో అడుగుపెట్టారు. క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఆర్.ఆర్.ఆర్ 1947 స్వాతంత్య్రానికి పూర్వం జరిగే హిస్టారికల్ డ్రామా. కొమరం భీమ్(తారక్) అల్లూరి సీతారామరాజు (చరణ్) ఒకరితో ఒకరు చేతులు కలిపి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు ముందుకొస్తారు. ఇదే క్లైమాక్స్ సీక్వెన్స్ .. దీనిని ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా తెరకెక్కిస్తున్నారు. ఇది వెండితెరపై మహదాద్భుతమైన విజువల్ ట్రీట్ అవుతుందని టీమ్ నుంచి లీకులు అందాయి.
ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవ్ గన్.. అలియా భట్- ఒలివియా మోరిస్- రే స్టీవెన్సన్- అలిసన్ డూడీ- సముదిరకని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ ప్రాజెక్టును రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న సినిమా రిలీజ్ కానుంది.