టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల విడుదల తేదీలు మారుతూ ఉండటం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం మరియు కరోనా కారణంగా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ ముగియక పోవడంతో ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయాల్సిన సినిమాను కాస్త వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఆరు నెలలు ఆస్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగి అప్పటి వరకు పరిస్థితులు అన్ని సర్థకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలని భావిస్తున్నారట. కరోనా వేవ్స్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ 2021 అనుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కాస్త వచ్చే ఏడాదికి వాయిదా పడటం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కల్స్ లో చర్చించుకుంటున్నారు.
మొదట ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఈ ఏడాదిలో వాయిదా పడ్డ పెద్ద సినిమాల్లో చాలా వరకు జనవరి లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కనుక ఈ సినిమా ను మరింత ఆలస్యంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే విడుదల తేదీని ఏకంగా ఏప్రిల్ కు మార్చినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందేమో చూడాలి. ఇక షూటింగ్ విషయానికి వస్తే రెండు నెలల వర్కింగ్ డేస్ తో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా జక్కన్న టీమ్ మెంబర్స్ చెబుతున్నారు.