ఫోటో స్టోరి: టెంపరేచ‌‌ర్ పెంచుతున్న హాటీ అందాలు

Update: 2020-09-23 14:00 GMT
సినిమా అనేది ఒక అంద‌మైన వ‌ల‌. ఇదో గ్లామ‌ర్ నెట్. ఇక్క‌డ నిల‌బ‌డాలంటే అందాల ఎర వేయాల్సిందే. అలా చేయ‌లేదంటే ఇక్క‌డ ఎవ‌రూ ఎవరినీ ప‌ట్టించుకోరు. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌రు. ఇక హిట్ లు ద‌క్క‌లేదో వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ విష‌యాల్ని యంగ్ హాట్ బ్యూటీ రుహానీ శ‌ర్మ బాగానే ఒంట‌బ‌ట్టించుకున్న‌ట్టుంది.

త‌న గురించి చ‌ర్చ జ‌ర‌గ‌డం లేద‌ని తెలిసిన‌ప్పుడ‌ల్లా హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేస్తూ కాక‌పెంచుతోంది. సుశాంత్ న‌టించిన `చి!!ల‌!!సౌ` చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రెడ్ హాట్ లేడీ త‌మిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించినా టాలీవుడ్ వ‌ల్లే పాపుల‌ర్ అవుతోంది. రుహానీకి సోష‌ల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ కూడా ఇప్ప‌టికే పెరుగుతోంది.

త్వ‌ర‌లో అది ట్రెండ్ సెట్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. నెటిజ‌న్స్ ‌తో పాటు ఫ్యాన్స్ కి సోష‌ల్ మీడియాలో నిత్యం అందుబాటులో వుండే రుహానీ శ‌ర్మ తాజాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో బ్లాక్ బ్రా ధ‌రించి బ్లాక్ స్పోర్ట్స్ డ్రెస్సులో అందాల‌న్నీ ప‌రుస్తూ చేసిన ఫొటో సెష‌న్ కేక పుట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసే వారికి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదంట‌. `హిట్‌`తో హిట్ ‌ని సొంతం చేసుకున్న రుహానీ శ‌ర్మ ప్ర‌స్తుతం `నూటొక్క జిల్లాల అంద‌గాడు` చిత్రంలో న‌టిస్తోంది.
Tags:    

Similar News