'జాన్‌' కు ఆర్ధిక సమస్యలు పుకార్లు నిజమెంత?

Update: 2019-09-24 05:17 GMT
ప్రభాస్‌ 'సాహో' చిత్రం 350 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో ప్రభాస్‌ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్‌ లు నిర్మించిన ఈ చిత్రం ఆర్ధికంగా నిరాశ పర్చింది. సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయినా బడ్జెట్‌ ఎక్కువ అవ్వడం వల్ల నష్టాలు మిగిలినట్లుగా ప్రచారం జరుగుతుంది. సాహో వల్ల యూవీ క్రియేషన్స్‌ కు భారీ నష్టాలు వచ్చాయని.. ఆ ప్రభావం ప్రభాస్‌ తర్వాత నటించబోతున్న 'జాన్‌' పై పడిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 'జాన్‌' సినిమా మొదట యూవీ క్రియేషన్స్‌ లో అనుకున్నప్పటికి షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికి గోపీ కృష్ణ బ్యానర్‌ లో కృష్ణం రాజు నిర్మాణంకు షిప్ట్‌ అయ్యింది. గోపీ కృష్ణ బ్యానర్‌ తో పాటు యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రంలో సహ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. అలాగే సాహో వల్ల యూవీ క్రియేషన్స్‌ కు వచ్చిన భారీ నష్టాలేమీ లేవు. సినిమాను ముందుగానే యూవీ క్రియేషన్స్‌ అమ్మేయడం జరిగింది.

సాహోకు మరీ డిజాస్టర్‌ వసూళ్లు ఏమీ నమోదు కాలేదు. కనుక యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ ఆర్ధిక సమస్యల్లో ఏమీ లేదు. ఒక వేళ యూవీ క్రియేషన్స్‌ చిన్న చిన్న సమస్యలతో ఉన్నా కూడా గోపీకృష్ణ మూవీస్‌ పై కృష్ణంరాజు పూర్తి బాధ్యత తీసుకుని సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారట. రాధాకృష్ణ దర్శకత్వంలో స్టైలిష్‌ మూవీగా రూపొందుతున్న 'జాన్‌' మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాహో వల్ల కాస్త బ్రేక్‌ ఇచ్చిన ప్రభాస్‌ మళ్లీ జాన్‌ తో బిజీ అయ్యాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుండగా కాజల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతుంది.

Tags:    

Similar News