మెగా మేనల్లుడు కూడా అదే కాన్సెప్ట్‌

Update: 2019-02-17 02:30 GMT
నాన్నకు ప్రేమతో, సన్నాఫ్‌ సత్యమూర్తి, నేను శైలజ చిత్రాలతో పాటు ఇంకా పలు చిత్రాలు తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌ తో వచ్చినవే. వీటిల్లో ఎక్కువ శాతం సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. దాంతో ప్రస్తుతం కూడా చాలా సినిమాలు తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ అనే రెగ్యులర్‌ ఫార్ములాలో రాబోతున్నాయి. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా, మహేష్‌ బాబు మహర్షి చిత్రం, నాని 'జెర్సీ' సినిమాలు కూడా తల్లి, దండ్రి సెంటిమెంట్‌ నేపథ్యంలో ఉంటాయనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ కూడా అదే కోవకు చెందినది అంటూ వార్తలు వస్తున్నాయి.

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్‌ మరియు నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్న 'చిత్రలహరి' చిత్రాన్ని కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈయన గతంలో కూతురు తండ్రి సెంటిమెంట్‌ కాన్సెప్ట్‌ తో సినిమాను తీశాడు. ఆ సినిమాకు మంచి ఆధరణ దక్కింది. దాంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న చిత్ర లహరి చిత్రంలో కూడా అదే తండ్రి సెంటిమెంట్‌ ను వర్కౌట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

'నేను శైలజ' చిత్రంలో కూతురు తండ్రి అయితే 'చిత్రలహరి' చిత్రంలో కొడుకు తండ్రి సెంటిమెంట్‌ అంతే తేడా అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా అనఫిషియల్‌ గా తెలుస్తోంది. షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోవడంతో 'చిత్రలహరి' ప్రమోషన్‌ కార్యక్రమాలకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్‌ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. హెవీ కాంపెటీషన్‌ ఉన్న ఈ సమయంలో రొటీన్‌ కాన్సెప్ట్‌ తో రాబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడనేది చూడాలి. గత రెండేళ్లుగా సాయి ధరమ్‌ తేజ్‌ సక్సెస్‌ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ ఆయనకు చాలా కీలకం.

Tags:    

Similar News