తేజ్ ఐ లవ్ యు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి కొంత టైం తీసుకుని కొత్త మేకోవర్ లోకి మారిపోయిన సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తన కొత్త సినిమా చిత్రలహరి కోసం సెట్స్ లోకి ఇవాల్టి నుంచి అడుగు పెట్టాడు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ హీరొయిన్ల పేర్లను ఆధారంగా చేసుకోవడం విశేషం. చిత్ర-లహరి అనే రెండు పాత్రలను నివేతా పెతురాజ్ - కళ్యాణి ప్రియదర్శిని పోషిస్తున్నారు. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన టీం ఇక నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరపబోతున్నారు.
మైత్రి సంస్థ కావడంతో నిర్మాణ పరంగా రాజీ ఉండదు కాబట్టి తేజుకి ఇది గట్టి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న చిత్రలహరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన లవ్ స్టొరీ అని తెలిసింది. చిత్రలహరి హిట్ కావడం అందులో ఉన్న అందరకి అవసరం. దర్శకుడు తిరుమల కిషోర్ గత చిత్రం ఉన్నదీ ఒకటే జిందగీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మైత్రి సంస్థకు ఒకే నెలలో రెండు షాకులు సవ్యసాచి-అమర్ అక్బర్ అంటోనీ రూపంలో తగిలాయి.
హలో పరాజయం కళ్యాణి ప్రియదర్శిని అవకాశాల మీద ప్రభావం చూపించింది. మెంటల్ మదిలో లాంటి ఫీల్ గుడ్ మూవీతో పరిచయమైనా నివేదా పెతురాజ్ కు ఆశించిన బ్రేక్ దక్కలేదు. ఈ నేపధ్యంలో చిత్రలహరి అందరికి కామన్ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నారు. తేజు మాత్రం రంగస్థలంలో చిట్టిబాబు తరహాలో గుబురు గెడ్డంతో పెంచి వెరైటీ లుక్ లోకి వచ్చేసాడు.